India – Canada, Covid-19 vaccine: కరోనావైరస్‌తో అల్లాడుతున్న దేశాలకు భారత్ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ వ్యాక్సిన్ సాయం కోరిన ప్రతీ దేశానికి భారత్ సాయమందిస్తూ.. ఉదారత చాటుకుంటుంది. గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పలుదేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేసింది. ఈ క్రమంలోనే కెనాడాకు కూడా కరోనా వ్యాక్సిన్‌కు సాయమందించాలని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆయన మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఇప్పటికే భారత్ తరుపున అన్ని విధాలా సాయమందిస్తున్నామని.. కెనడా దేశానికి కూడా సాయమందించేందుకు కృషి చేస్తామని ప్రధాని మోదీ కెనడా ప్రధానికి హామీనిచ్చారు.
ఈ సందర్భంగా కెనడా ప్రధాని ట్రూడో మాట్లాడుతూ.. కరోనాపై ప్రపంచం విజయం సాధిస్తే.. అది భారత్ వద్ద ఉన్న అపారమైన ఫార్మా సామర్థ్యం. దాన్ని ఇతర దేశాలకు పంచుకునే విషయంలో ప్రధాని మోదీ నాయకత్వం, కృషి వల్లేనని ట్రూడో అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని పీఎంఓ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతోపాటు ప్రధాని మోదీ కూడా ఈ విషయంపై ట్విట్ చేశారు. ఈ సందర్భంగా నేతలిద్దరూ వాతావరణ మార్పు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై పరస్పర సహకారం కొనసాగించాలని నిర్ణయించారు.
Also Read: