Cherry Tomatoes: టమాటా దేశీయ కూరగాయల్లోనే కాదు.. ప్రపంచం దేశాల్లో కూడా ప్రముఖ స్థానం సంపాదించుకుంది. ఎర్రగా అందంగా చూడముచ్చటగా కనిపించే టమాటోలను మొదట్లో ఇంగ్లాండ్ లో అందం కోసం పెంచుకునేవారట.. కాలక్రమంలో టమాటా కూరగాయగా మార్పు చెందింది. ఇంగ్లాండ్ నుంచి భారతదేశంలో సుమారుగా 1850 లలో ప్రవేశించింది. తెలుగులో సీమ వంగ, రామ ములగ అని అంటారు. ఇప్పుడు మనదేశంలో టమాటో కూరలేని ఇల్లు, టమాటో కూరలేని దుకాణము ఉండదు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు.
టమాటోలు ఆరోగ్యానికి మేలు చేసస్తాయి. శక్తివంతమైన యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తాయి. సాధారణంగా రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని చెపుతారు . . . కాని అన్ని కాలాల్లో లభించే టమాటోలు తీసుకుంటే డాక్టరుతో అవసరముండదని చెప్పవచ్చు. ఒక టమాటా చెట్టు.. గుబురుగా పెరిగి.. గుత్తులు గుత్తులుగా ఐదు నుంచి 6 కాయలు.. ఇలా మొత్తం చెట్టు మహా అయితే ఒకేసారి 25 వరకూ కాస్తాయి. అయితే ఓ వ్యక్తి.. కొత్త పద్దతిలో వ్యవసాయం చేసి.. ఒక చెట్టుకు ఏకంగా 839 కాయలు కాశాయి. ఈ చెట్టుకు పసుపు టమాటా లు కసాయి. వీటిని చెర్రీ టమోటాలుగా పిలుస్తారు. వీటిని స్నాక్స్ తయారు చేయడానికి వినియోగిస్తారట.
బ్రిటన్ కు చెందిన డగ్లస్ స్మిత్ అనే 43 ఏళ్ల వ్యక్తి సాధారణ ఊహకు అందని అపురూపమైన ఘనత సాధించాడు. స్మిత్ తాను చేస్తున్న ఐటీ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మరోవైపు తనకు ఇష్టమైన వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు. సాగు లో కొత్త పద్దతులను తీసుకుని వచ్చి.. తాను పండించే పంట దిగుబడిలో ఓ రేంజ్ లో సాధిస్తున్నాడు. గ్రీన్ హౌస్ పద్దతిలో చెర్రీ టమోటా పంటను సాగు చేస్తున్నాడు. మార్చి నెలలో టమోటాల విత్తనాలను నాటాడు. మొక్కను పెంచడానికి స్మిత్ రోజులో 3 నుంచి 4 గంటల సమయం వెచ్చించాడు. ఇప్పుడు ఆ టమాటా మొక్కకు ఏకంగా 839 టమాటాలు కసాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో ఈ మొక్క స్థానం చోటు చేసుకుంది. దీనికి కారణం గ్రీన్చే హౌస్ పద్ధతిలో సాగు చేయడం కారణం అని స్మిత్ చెప్పాడు.
So today I went for a Guinness World record attempt for ‘most tomatoes on a single truss / stem’.
Today we counted 839 tomatoes vs current WR of 488!! Awaiting verification from Guinness in due course. pic.twitter.com/OgdbUk02rF
— Douglas Smith (@sweetpeasalads) September 10, 2021
Also Read: మళ్ళీ తమిళనాడు, కేరళ మధ్య జలవివాదం.. తమ ప్రజలకు మలయాళ నటులు మద్దతు..