‘టైటానిక్’ హీరోకు బ్రెజిల్ ఉపాధ్యక్షుడు సవాల్‌

| Edited By:

Aug 20, 2020 | 3:20 PM

ప్రముఖ హాలీవుడ్ నటుడు, పర్యావణవేత్త లియోనార్డో డికాప్రియోకు బ్రెజిల్ ఉపాధ్యక్షుడు హమిల్టన్‌ మౌరావ్‌ సవాల్ విసిరారు

టైటానిక్ హీరోకు బ్రెజిల్ ఉపాధ్యక్షుడు సవాల్‌
Follow us on

Leonardo DiCaprio Amazon: ప్రముఖ హాలీవుడ్ నటుడు, పర్యావణవేత్త లియోనార్డో డికాప్రియోకు బ్రెజిల్ ఉపాధ్యక్షుడు హమిల్టన్‌ మౌరావ్‌ సవాల్ విసిరారు. ప్రఖ్యాత అమెజాన్‌ అడవిలో ఓ ఎనిమిది గంటల పాటు నడవాలని, అప్పుడు ఆ ఆడవి ఎలా ఉందన్న విషయం అతడికి తెలుస్తుందని ఆయన అన్నారు.

ఈ మేరకు ఓ ఈవెంట్‌లో మాట్లాడిన మౌరావ్‌.. మా తాజా క్రిటిక్, నటుడు లియోనార్డో డికాప్రియోకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. నాతో పాటు ఆయనను ఉత్తర బ్రెజిల్‌లో ఉన్న సావో గేబ్రిల్‌ ద కాచేయిరాకు వచ్చి ఎనిమిది గంటల పాటు అడవిలో నడవమని చెప్పండి. అప్పుడే ఆ ప్రాంతంలో పర్యావరణ రక్షణ కోసం ఎలాంటి పనులు జరుగుతాయో తెలుస్తోంది అని అన్నారు.

కాగా ఇటీవల లియోనార్డో తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలను షేర్ చేశారు. బ్రెజిల్‌ స్పేస్ ఏజెన్సీ నుంచి తీసిన ఫొటోలు అంటూ ఇటీవల లియోనార్డో కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. శాటిలైట్ డేటా ప్రకారం బ్రెజిల్‌లోని అమెజాన్‌లో మంటలు ఎక్కువవుతున్నాయని కామెంట్ పెట్టారు. దానిపై మౌరావ్ స్పందించారు. కాగా పర్యావరణ పరిరక్షణ కోసం లియోనార్డో పలుమార్లు తన గళం విప్పారు. అంతేకాదు ఆస్కార్ సాధించిన సమయంలోనూ ఆయన పర్యావరణ రక్షణ గురించే మాట్లాడిన విషయం తెలిసిందే.

Read More:

పడిపోయిన అమ్మకాలు.. హార్లే డేవిడ్సన్ కీలక నిర్ణయం!

రెబల్‌స్టార్‌ ‘ఆదిపురుష్’‌.. అప్‌సెట్‌ అయిన కరణ్‌