పడిపోయిన అమ్మకాలు.. హార్లే డేవిడ్సన్ కీలక నిర్ణయం!

కుర్రకారు డ్రీమ్ బైక్‌ హార్లే-డేవిడ్సన్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమ్మకాలు పడిపోవడంతో భారతదేశ కార్యకలాపాల నుంచి నిష్క్రమించాలనే ఆలోచనలో హై ఎండ్‌ బైక్ తయారీ సంస్థ ఉన్నట్లు సమాచారం

పడిపోయిన అమ్మకాలు.. హార్లే డేవిడ్సన్ కీలక నిర్ణయం!
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2020 | 5:51 PM

Harley Davidson India: కుర్రకారు డ్రీమ్ బైక్‌ హార్లే-డేవిడ్సన్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమ్మకాలు పడిపోవడంతో భారతదేశ కార్యకలాపాల నుంచి నిష్క్రమించాలనే ఆలోచనలో హై ఎండ్‌ బైక్ తయారీ సంస్థ ఉన్నట్లు సమాచారం. భవిష్యత్తు డిమాండ్‌పై డైలమా నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందని సంస్థ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో హర్యానాలోని బావాల్ వద్ద ఉన్న తన ఫ్లాంట్‌కి త్వరలో మూతవేయనున్నట్లు సమాచారం.  ఈ మేరకు ఔట్‌సోర్సింగ్ ఒప్పందం కోసం ఇప్పటికే కొంతమంది వాహన తయారీదారులను సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది. కాగా గత నెలలో రెండవ త్రైమాసిక ఫలితాల సమయంలోనే సంస్థ  ఈ సంకేతాలు ఇచ్చింది. భవిష్యత్ వ్యూహానికి అనుగుణంగా లాభాలు లేని అంతర్జాతీయ మార్కెట్ల నుండి నిష్క్రమించే ఆలోచనలో ఉన్నామని ఆ సమయంలో కంపెనీ వెల్లడించింది.

కాగా 2009 లో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించిన హార్లే-డేవిడ్సన్ ఇక్కడ 10 సంవత్సరాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దేశీయ కస్టమర్లను ఆకట్టుకోవడంతో పాటు కొత్త బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా కొత్త మోడళ్లను కూడా విడుదల చేసింది. కానీ అనుకోకుండా కరోనా వైరస్ రావడంతో అటు దేశీయంగా, ఇటు అంతర్జాతీయంగా ఆటో మొబైల్ రంగం ఆర్ధిక నష్టాలను చవిచూస్తోంది. విక్రయాలు దాదాపు లేకపోవడంతో స్పేర్ పార్ట్స్‌ని కూడా విక్రయించుకోలేని పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే భారత్  అత్యంత చెత్త మార్కెట్‌గా వెల్లడించిన ఈ సంస్థ త్వరలో తమ ఫ్లాంట్‌ని మూసివేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఊహాగానాలపై స్పందించేందుకు సంస్థ నిరాకరించింది.

Read More:

రెబల్‌స్టార్‌ ‘ఆదిపురుష్’‌.. అప్‌సెట్‌ అయిన కరణ్‌

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌.. మూడో దశ ట్రయల్స్‌కి గ్రీన్‌సిగ్నల్‌