నిద్రలో గుండెలపై ఎవరో కూర్చొనట్టు అనిపిస్తుందా.?
TV9 Telugu
26 April 2024
ఒక్కోసారి రాత్రి నిద్రపోతున్న సమయంలో చాలామందికి గుండెలపై ఎవరో కూర్చుని, పీకనులుముతున్నట్లు అనిపిస్తుంది.
అరుద్దామంటే నోట్లో నుంచి మాటపెగలదు. అరుస్తున్నట్లే అనిపిస్తుంది కానీ అది మన చుట్టూ ఉన్న ఎవ్వరికీ వినిపించదు.
ఎంత ప్రయత్నించినా కదలడానికి అస్సలు కుదరదు. దీనికి నిద్రిస్తున్న సమయంలో పైన గాలి పడిందని చాలమంది నమ్ముతారు.
తెల్లారాక దెయ్యం గుండెలపై కూర్చుని హింసించిందని రకరకాలుగా చెప్పుకుని భయాందోళనలకు గురవుతుంటారు కొందమంది.
అయితే ఇది దయ్యామో, భూతమో కాదని, ఇదొకో శారీరక చర్య అని తేల్చి చెప్పారు చేస్తున్నారు వైద్యారోగ్య నిపుణులు.
దీనిని స్లీప్ పెరాలసిస్ అంటారు. అంటే నిద్ర సమయంలో కొన్ని క్షణాలపాటు శరీరమంతా పక్షవాతానికి గురవుతుందన్నమాట.
నిద్రలేమి, అవిశ్రాంతంగా పనిచేయడం వల్ల నిద్రించే సమయం నార్కోలెప్సీ అనే ఈ పెరాలసిస్ వస్తుందని అంటున్నారు నిపుణులు.
సాధారణంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు, తెల్లవారు జామున నిద్రలేచే సమయానికి ఇలా జరుగుతుంది. నిద్రలో ఏదైనా కల వచ్చే సమయంలో కూడా వస్తుంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి