అతడికి ఒకటి కాదు రెండు.. అవాక్కైన డాక్టర్లు.. చివరకి ఏం చేశారంటే..

|

Mar 15, 2022 | 7:54 PM

పురుషులకు ఒకటే అంగం(Penise) ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఉజ్జెకిస్తాన్ లోని ఓ బాలుడు రెండు పురుషాంగాలతో జన్మించాడు. ఇలా రెండు పురుషాంగాలతో పిల్లలు పుట్టడం అనేది అసంభవం. కానీ ఈ బాలుడి పరిస్థితి చూసి...

అతడికి ఒకటి కాదు రెండు.. అవాక్కైన డాక్టర్లు.. చివరకి ఏం చేశారంటే..
Penices
Follow us on

పురుషులకు ఒకటే అంగం(Penise) ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఉజ్జెకిస్తాన్ లోని ఓ బాలుడు రెండు పురుషాంగాలతో జన్మించాడు. ఇలా రెండు పురుషాంగాలతో పిల్లలు పుట్టడం అనేది అసంభవం. కానీ ఈ బాలుడి పరిస్థితి చూసి డాక్టర్లే అవాక్కయ్యారు. రెండూ సాధారణ పురుషాంగాల తరహాలోనే పనిచేస్తుండటంతో సమస్య ఏమీ లేదన్న వైద్యులు.. కొన్నాళ్లు అలాగే వదిలేశారు. ప్రస్తుతం ఆ బాలుడి వయసు ఏడు సంవత్సరాలు. ఇలా రెండేసి పురుషాగాలతో పిల్లలు పుట్టడమనేది గత 400 ఏళ్లలో ఇప్పటి వరకు కేవలం 200 కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీటిలో కొన్ని కేసుల్లో బిడ్డ పుట్టగానే సర్జరీ(Surgery) ద్వారా సరిచేశారు. మరికొన్ని సర్జరీలు మాత్రం విఫలమయ్యాయి. బాలుడికి రెండు మూత్ర నాళాలు ఉండటం వల్ల రెండు పురుషాంగాల నుంచి మూత్ర విసర్జన జరిగేది. బాలుడికి రెండు అంగస్తంభన నాళాలు ఉన్నాయి. అయితే, అతడికి అంగస్తంభన కలుగుతుందా లేదా అనేది వైద్యులు రిపోర్టులో వెల్లడించలేదు. రెండు పురుషాంగాలతో పుట్టే సమస్యను డిఫాలియా (Diphallia) అని అంటారు. దీనివల్ల వృషణాలు, జీర్ణ వ్యవస్థ, మూత్ర నాళాల్లో కూడా సమస్యలు ఏర్పడుతాయి. ఈ అరుదైన సమస్య పరిష్కారం కోసం సవాలుతో కూడిన ప్రక్రియ చేపట్టామని ఆ బాలుడికి సర్జరీ అందించిన వైద్యులు తెలిపారు. రెండు పురుషాంగాల్లో ఒకదాన్ని తొలగించామని వివరించారు.

సర్జరీలో భాగంగా బాలుడి ఎడమ వైపు పురుషాంగాన్ని చాలా జాగ్రత్తగా తొలగించామని అతడి మూత్ర వ్యవస్థను కుడి వైపు అంగానికి అనుసంధానించామని తెలిపారు. 21 రోజుల వరకు హాస్పిటల్ లోనే కాథెటర్ ద్వారా అతడికి మూత్ర సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. రెండు నెలల తర్వాత బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. గతేడాది ఇరాక్ లో మరో బాలుడు ఏకంగా మూడు పురుషాంగాలతో జన్మించాడు. అయితే, వాటిలో ఏ పురుషాంగం సక్రమంగా పనిచేయలేదు. కేవలం ఒకదానికి మాత్రమే గ్రంథి (హెడ్) ఉంది. అయితే, పుట్టిన వెంటనే ఈ సమస్య బయటపడలేదు. మూడు నెలల తర్వాత ఆ పసివాడి తల్లిదండ్రులు బిడ్డ పరిస్థితిని తెలుసుకుని వైద్యులను సంప్రదించారు. దీంతో వైద్యులు సర్జరీ ద్వారా ఆ సమస్యను పరిష్కరించారు.

Also Read

Big News Big Debate Live: బీజేపీ, జనసేన మధ్యలో టీడీపీ.. పవన్ ఫార్ములా ఫలించేనా..(వీడియో)

Viral Video: ఈ చేపకు ఏమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా.? వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్!

IPL 2022: రోహిత్ సేనకు బ్యాడ్ న్యూస్.. ఢిల్లీతో మ్యాచ్‌కు దూరం కానున్న కీలక ప్లేయర్? మార్చి 27న తొలిపోరు..