Bolivia: ఆందోళనలతో అట్టుడుకుతున్న బొలీవియా.. రోడ్డెక్కిన జనాలు.. లాఠీచార్జ్‌ చేస్తున్న పోలీసులు..

బొలీవియాలో నిరసన మిన్నంటుతోంది. ఆందోళనతో బొలీవియా అట్టుడుకుతోంది. నిరసన ప్రదర్శనలతో వీధులన్నీ మార్మోగుతున్నాయి.

Bolivia: ఆందోళనలతో అట్టుడుకుతున్న బొలీవియా.. రోడ్డెక్కిన జనాలు.. లాఠీచార్జ్‌ చేస్తున్న పోలీసులు..
Bolivia

Edited By:

Updated on: Oct 13, 2021 | 7:53 AM

Bolivia: బొలీవియాలో నిరసన మిన్నంటుతోంది. ఆందోళనతో బొలీవియా అట్టుడుకుతోంది. నిరసన ప్రదర్శనలతో వీధులన్నీ మార్మోగుతున్నాయి. ప్రెసిడెంట్‌ లూయిస్‌ ఆర్స్‌కు వ్యతిరేకంగా జనాలు రోడ్డెక్కారు. ప్రెసిడెంట్‌ పదవి నుంచి లూయిస్‌ తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు ఆందోళనకారులు. నిరసనకారులపై పోలీసులు విరుచుకుపడ్డారు. లాఠీచార్జ్‌ చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకదశలో ఆందోళనకారులపైకి భాష్పవాయువును ప్రయోగించారు. నిరసనకారుల్ని ఎక్కడికక్కడ చెదరగొట్టారు పోలీసులు. లూయిస్‌ ప్రెసిడెంట్‌ పదవి చేపట్టి ఏడాది అవుతోంది. అప్పుడే ప్రెసిడెంట్‌కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. లూయిస్‌ రాజకీయ హింసకు పాల్పడుతున్నారని ఆరోపిస్తోంది ప్రత్యర్థి వర్గం. ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించిన అనేక మందిని జైలుపాలు చేశారని విమర్శిస్తున్నారు. 2019లో అప్పటి ప్రెసిడెంట్‌ ఈవో మోరల్స్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఈ నిరసనలకు నేతృత్వం వహించిన జీనైన్‌ అనెజ్‌ను ప్రస్తుత ప్రెసిడెంట్‌ అక్రమంగా జైల్లో పెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్‌కు వ్యతిరేకంగా ఆందోళనల్ని ఉధృతం చేసింది విపక్షం. తాజాగా లాపాజ్‌, కోచబాంబ, సాంట క్రజ్‌, టారిజా ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగాయి. లా పాజ్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు ఆందోళనకారులు. రోడ్లుపై బైఠాయించడంతో రహదారులు మూసుకుపోయాయి.

బొలీవియా ప్రెసిడెంట్‌ ఇటీవల తీసుకున్న నిర్ణయం సైతం వివాదాస్పదంగా మారింది. కోర్ట్‌ ఆర్డర్‌ లేకుండా ప్రజల ఆస్తులపై ప్రభుత్వం విచారణ చేపట్టేందుకు వీలుగా ఓ చట్టాన్ని రూపొందించింది ప్రభుత్వం. ఈ చట్టంపైనా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి చట్టాలు ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని.. వెంటనే రద్దు చేయాలంటున్నారు బొలీవియా వాసులు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Largest Pumpkin: రైతుకి లక్షలార్జించిన భారీ గుమ్మడి కాయ..ప్రపంచంలో రెండో పెద్ద గుమ్మడికాయగా రికార్డ్

Covid-19 Vaccine: రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా లాభం లేదా..? ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు!

Afghan tourists: బోటింగ్‌తో సేదదీరుతున్న అఫ్గానీలు.. పెరుగుతోన్న టూరిస్ట్‌ల తాకిడి.. మరి తాలిబన్లు అనుమతి..?