Blast in Pakistan: పాకిస్తాన్‌లోని చమన్ ప్రాంతంలోని మసీదు వెలుపల శుక్రవారం సాయంత్రం భారీ పేలుడు జరిగింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ పేలుడులో 8 మంది మృతి చెందగా, 14 మంది గాయపడినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ మీడియా చెబుతున్నదాని ప్రకారం, పాలస్తీనాకు మద్దతుగా నిర్వహిస్తున్న ర్యాలీలో పేలుడు సంభవించింది. ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆదేశాల మేరకు పాలస్తీనాకు మద్దతుగా ఈ ర్యాలీని నిర్వహించారు. బులూచిస్తాన్ లో భాగమైన చమన్ ఒక పర్యాటక ప్రదేశం. ఇమ్రాన్ ఖాన్ పాలస్తీనాకు మద్దతుగా శుక్రవారం ర్యాలీలు నిర్వహించాలని కోరారు. జామియాట్-ఉలేమా-ఇ-ఇస్లాం ఈ ర్యాలీని చమన్లో నిర్వహించింది. ‘సామ న్యూస్’ ప్రకారం, ఈ సమయంలో చాలా మంది ప్రజలు గుమిగూడారు. ఈ సమయంలో, భారీస్థాయిలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 8 మంది మరణించినట్లు మీడియా చెబుతోంది. అయితే, పోలీసులు మాత్రం ఇప్పటివరకు 6గురు మరణించినట్లు ధృవీకరించారు.
ఇప్పటివరకూ ఈ ఘటనకు బాధ్యులుగా ఎవరినీ పోలీసులు పేర్కొనలేదు. అదేవిధంగా ఏ సంస్థా దీనికి బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించలేదు. గతంలో పాకిస్తాన్ లోని క్వెట్టా ప్రాంతంలో కూడా భారీ పేలుడు సంభవించింది. అప్పుడు ఆ పేలుళ్లకు తాలిబాన్ కారణమని చెప్పారు.
బలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి లియాఖత్ షావానీ మాట్లాడుతూ ర్యాలీ సందర్భంగా ప్రజలు ఎక్కువగా ఉన్న సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 6 గురు మరణించారు. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఆత్మాహుతి దాడి లేదా ఐఇడి ద్వారా పేలుడా అనేది ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
గతంలో బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ సైన్యంపై కూడా దాడులు జరిగాయి. అప్పుడు ఆర్మీ పోస్టులను లక్ష్యంగా చేసుకున్నారు. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ వైమానిక దళం ఇక్కడ వైమానిక దాడులు చేస్తోందని అక్కడి ప్రభుత్వ ప్రతినిధి ఆరోపించారు. పాకిస్తాన్ సైన్యం ఏప్రిల్‌లో ఇక్కడ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించింది. ఈ సమయంలో పేలుడు జరిగి 5 మంది మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. గత ఏడాది అక్టోబర్ 16 న ఆర్మీ కాన్వాయ్‌పై దాడి జరిగింది. 7గురు సైనికులు మరణించారు. ఆగస్టులో జరిగిన వేర్వేరు దాడుల్లో 19 మంది మరణించారు.
India: కరోనా సెకండ్ వేవ్.. భారత్‌కు 40 దేశాల సాయం.. విదేశాంగ శాఖ ప్రకటన..