ఈ క్రూరారణ్యంలో ఎవరిది, ఏ జంతువుది ఎప్పుడు పై చేయి అవుతుందో., ఏది ఏ జంతువును డామినేట్ చేస్తుందో చెప్పడం, ఊహించడం కష్టం.. రెండూ సమాన బలం గలవైనా ఒకటి మాత్రం తోక ముడవడం ఖాయం.. మరి ఎదుటి జంతువు మొదటే మరీ తీక్షణంగా గుడ్లురిమి చూసినా, కోరలు చూపుతూ గాండ్రించినా దానికి ఎదురుపడిన మరో క్రూర జంతువు వెనక్కి తగ్గుతుంది. కాస్త తటపటాయించి వెనకడుగు వేస్తుంది. సరిగ్గా ఇలాంటి ఒళ్ళు గగుర్పొడిచే ఘటనే కర్ణాటక లోని కబిని వన్యమృగ సంరక్షణా కేంద్రంలో జరిగింది. ఇటీవల ఇక్కడ ఓ చెట్టు మీద చిరుత ఒకటి హఠం వేసుకుని కూర్చుంది. ఎలా ఎక్కిందో గానీ చిటారు కొమ్మ వరకు ఎక్కేసింది. కాసేపటికి అక్కడి చేరుకున్న బ్లాక్ పాంథర్ (నల్ల చిరుత) దాన్ని చూసింది. ఏమనుకుందో ఏమో ! తాను కూడా చెట్టు ఎక్కింది. చెట్టు మొదట్లో కాండం మీద కొద్దిసేపు అలాగే ఉండిపోయింది. అప్పటికే దాన్ని చూసిన చిరుత గాండ్రించడం మొదలు పెట్టింది. అది దాడికి దిగితే తాను కూడా రెడీ అన్నట్టు కోరలు చాస్తూ తను ఉన్న చోటనుంచే ‘రెడ్ సిగ్నల్’ ఇస్తూ బిల్డప్ ఇచ్చింది. నల్ల చిరుత కొన్ని క్షణాల్లో ఇంకాస్త పైకి ఎక్కింది. తడబడుతూనే మరికొంత దూరం ఎక్కి చివరకు చిరుత సమీపం వరకు వెళ్ళింది. ఇక ఈ రెండు క్రూర జంతువులూ భీకరంగా కలియబడడం ఖాయం అనుకునేంతలో నల్లది రెండు మూడు క్షణాలు అక్కడే నిలబడి చివరకు మెల్లగా బ్యాక్ సిగ్నల్ ఇస్తున్నట్టు తగ్గింది. మరి ఇది పూర్తిగా చెట్టు దిగిపోయిందా, చివరకు ఈ జంతువుల మధ్య ఏం జరిగిందన్నది మాత్రం పూర్తి సస్పెన్స్ గా ఉండిపోయింది. అక్కడితో వీడియో ఆగిపోయింది. ఈ ఎన్ కౌంటర్ కథ ఎటూ తేలలేదని నెటిజన్లంతా విసుక్కున్నారు.
విజయ్ ప్రభు అనే వ్యక్తి ఈ వీడియో తీశారని, ఆయనదే ఈ క్రెడిట్ అంటూ ఇన్ ఫోసిస్ కు చెందిన నందన్ నీలేకని దీన్ని ట్విటర్ లో షేర్ చేశారు. మరి మనమూ చూసేద్దాం !
Saw today, 6th March, in Kabini wild life sanctuary — another epic encounter between the Black Panther and his adversary Scarface! Video credit: Vijay Prabhu. pic.twitter.com/151Ip1bMGz
— Nandan Nilekani (@NandanNilekani) March 6, 2021
మరిన్ని చదవండి ఇక్కడ : గ్రహంపై గంటల శబ్దం , మాటల గుసగుసలు..!ఆడియో విడుదల చేసిన నాసా.:The NASA delivered audio by lazers video.
శోభనానికి అంగీకరించని భార్య ఆరాతీస్తే విస్తుపోయే నిజాలు.. షాక్ అయిన భర్త..! : Wedding viral Video
సీఎం జగన్ కు… తాగుబోతుల విన్నపం ..!వైరల్ అవుతున్న లెటర్.: drunkards request CM Jagan Video