కెనడాలోని గ్రేటర్ టొరంటో నగర వీధుల్లో ప్రధాని మోదీ చిత్రంతో కూడిన భారీ బిల్ బోర్డులు వెలిశాయి. తమ దేశానికి కోవిడ్ 19 వ్యాక్సిన్లు అందజేసినందుకు మోదీకి, ఇండియాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ బోర్డులు ఏర్పాటు చేశారు. ‘లాంగ్ లివ్ కెనడా-ఇండియా ఫ్రెండ్ షిప్’ అని కూడా వీటిలో పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్లను పంపిణీ చేయడంలో ప్రపంచంలో పలు దేశాలకు ఇండియా ఆపన్న హస్తమైంది. ఆయా దేశాలతో బాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భారత్ ను ప్రత్యేకంగా ప్రశంసించింది. ఈ కరోనా పాండమిక్ సమయంలో చాలా దేశాలకు, ముఖ్యంగా పేద, వర్ధమాన దేశాలకు మీరు వ్యాక్సిన్లను పంపిణీ చేయడం గొప్ప విషయమని ఈ సంస్థ హెడ్ టెడ్రోస్ ..మోదీని, ఇండియాను కొనియాడారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.గతవారం ఇండియా కెనడాకు 5 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను పంపింది.ఇప్పటివరకు సుమారు 50 దేశాలకు తాము టీకామందులు పంపినట్టు మోదీ ఆ మధ్య ఇండియా-స్వీడన్ వర్చ్యువల్ మీట్ లో తెలిపారు. రానున్న నెలల్లో మరిన్ని దేశాలకు సప్లయ్ చేస్తామన్నారు.
మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ సైతం ఇండియాను ఆకాశానికెత్తేశారు. కోవిడ్ పై పోరులోను, వ్యాక్సిన్ ఉత్పాదకతలోను భారత్ కృషి అమోఘమని ఆయన కూడా ట్వీట్ చేశారు. ఇన్ని దేశాలకు ఇండియా నుంచి వ్యాక్సిన్ వెళ్లడం గ్రేట్ అని ఆయన అభివర్ణించారు.అటు తాము దాదాపు 150 దేశాలకు మెడిసిన్స్, ఇతర అవసరాలను కూడా పంపనున్నామని మోదీ పేర్కొన్నారు. ఆన్ లైన్ శిక్షణ కార్యక్రమాల ద్వారా ఫ్రంట్ లైన్ వర్కర్లతో తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నామని, ఎప్పటికప్పుడు ఆయా దేశాల అవసరాలను తెలుసుకుంటున్నామని ఆయన అన్నారు. దూర దేశాలకే కాదు… పొరుగునున్న బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక వంటి దేశాలకు కూడా ఇండియా వ్యాక్సిన్ సప్లయ్ చేస్తోంది. ఇటీవలే పాకిస్థాన్ కూడా ఓ అంతర్జాతీయ ఒప్పందం కింద ఇండియా నుంచి టీకామందులను దిగుమతి చేసుకుంది.
Billboards come up in Greater Toronto area thanking PM Narendra Modi for providing COVID-19 vaccines to Canada pic.twitter.com/0AaQysm6O1
— ANI (@ANI) March 11, 2021
మరిన్ని చదవండి ఇక్కడ :