Bill Gates and Melinda Gates Divorce: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్‌మిలిందాగేట్స్ ఫాండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్..ఆయన సతీమణి మిలిందా విడాకుల నిర్ణయం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. తమ విడాకులకు నిర్ధిష్టమైన కారణాలేవీ వారు వెల్లడించలేదు. ఇక కలిసి జీవితంలో ముందుకు వెళ్లలేమన్న కారణంగా విడాకుల నిర్ణయం తీసుకున్నట్లు మాత్రమే గేట్స్ దంపతులు సంయుక్త ప్రకటనలో తెలిపింది. అయితే వీరి విడాకుల నిర్ణయానికి కారణాలు ఇవేనంటూ ఆసక్తికరమైన అంశాలు ప్రచారం జరుగుతున్నాయి. విడాకులు తీసుకువాలని వారు ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేదని.. రెండేళ్ల క్రితం నుంచే విడాకుల కోసం మిలిందా గేట్స్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో వెల్లడించింది. బిల్ గేట్స్ నుంచి విడాకుల కోసం మిలిందా 2019లోనే అడ్వకేట్లను సంప్రదించినట్లు ఆ పత్రిక తెలిపింది. దీనికి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్స్‌ను కూడా ఆ పత్రిక సేకరించింది.
విడాకులకు కారణం అదేనా?
లైంగిక నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఎప్‌స్టెయిన్ బేగన్‌తో బిల్ గేట్స్ సత్సంబంధాలు కొనసాగించడం ఇష్టంలేకపోవడమే ఆయన నుంచి విడిపోవాలని మిలిందా గేట్స్ నిర్ణయం తీసుకోవడానికి కారణమని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. 2019 ఆగస్టులో ఎప్‌స్టెయిన్ జైలులోనే మృతి చెందాడు. ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి చర్చించేందుకు బిల్ గేట్స్ ఎప్‌స్టెయిన్ బేగన్‌ను పలుసార్లు కలిసినట్లు బిల్ గేట్స్ అధికారప్రతినిధి బ్రిడ్జిట్ అర్నాల్డ్ తెలిపారు. ఎప్‌స్టెయిన్‌ను కలిసినట్లు స్వయంగా 2019 సెప్టెంబర్ నాటి ఇంటర్వ్యూలో అంగీకరించిన బిల్ గేట్స్…అయితే ఆయనతో తనకు ఎలాంటి వాణిజ్య సంబంధాలు, స్నేహ సంబంధాలు లేవని స్పష్టంచేశారు.
నివ్వెరపరిచిన గేట్స్ దంపతుల నిర్ణయం…
27 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకున్నట్లు బిల్ గేట్స్ దంపతులు ఈ నెల 3న ట్విట్టర్‌లో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడిగానే కాకుండా..పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందారు బిల్‌గేట్స్, మిలిందా దంపతులు. ఎన్నో సమాలోచనలు, ఎంతో మథనం తర్వాత మా వైవాహిక బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయానికి వచ్చామని, గత 27 ఏళ్లలో మేము ముగ్గురు అత్యద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దామని వారు ప్రకటించారు. ఇక దంపతులుగా కొనసాగలేమన్న వారి ప్రకటన యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే తమ ఫౌండేషన్ ద్వారా మాత్రం కలిసి పనిచేసేందుకు సిద్ధమని బిల్‌గేట్స్, మిలిందా ప్రకటించారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, నిర్మాణాత్మకంగా ఎదిగేలా తమ ఫౌండేషన్ ద్వారా కృషి చేశామని…ఈ మిషన్‌లో తమ భాగస్వామ్యం ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టంచేశారు. అయితే భార్యాభర్తలుగా ఇక కొనసాగలేమని భావించామని..కొత్త ప్రపంచంలోకి మేం వెళ్లేందుకు వీలుగా విడాకుల నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తమ వ్యక్తిగత ఆకాంక్షలను, మా విడాకుల నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నా మంటూ ట్విటర్‌లో ప్రకటించారు బిల్‌గేట్స్, మిలిందా.
1994లో బిల్ గేట్స్, మిలిందా వివాదం..
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో బిల్‌గేట్స్ ఒకరు. గత ఫిబ్రవరి నాటికి ఆయన ఆస్తి విలువ 137 బిలియన్ డాలర్లు. 2000 సంవత్సరంలో బిల్-మిలిందా గేట్స్ ఫౌండేషన్ స్థాపించిన బిల్‌గేట్స్, మిలిందా జంట..పలు ధార్మిక కార్యక్రమాలకు 53 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. ప్రస్తుతం బిల్‌గేట్స్ వయసు 65 ఏళ్లు , మిలిందా వయసు 56 ఏళ్లు. మైక్రోసాఫ్ట్‌ను సీఈవోగా బిల్‌గేట్స్ ఉన్న సమయంలో ప్రొడక్ట్ మేనేజరుగా మిలిందా చేరారు. మొట్టమొదటి సారిగా కంపెనీలో చేరిన ఎంబీఏ గ్రాడ్యుయేట్లలో ఏకైక మహిళ మెలిందా కావడం విశేషం. 1994లో బిల్‌గేట్స్, మిలిందా వివాహం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి..కరోనా బారినపడ్డ జూనియర్ ఎన్టీఆర్.. స్వయంగా ట్వీట్.. ప్రస్తుతం ఎలా ఉందంటే