అమెరికా శివార్లలో పెరుగుతున్న శరణార్థులు, మెక్సికో నుంచి వేలాదిగా వస్తున్న పిల్లలు

| Edited By: Anil kumar poka

Mar 10, 2021 | 1:59 PM

ఇతర దేశాల నుంచి తమ దేశంలోకి చట్టవిరుధ్దంగా ప్రవేశిస్తున్నవారి పట్ల తాము జాలి, దయా గుణాలతో వ్యవహరిస్తామని, మానవత్వంతో వారిని ఆదుకుంటామని అధ్యక్షుడు జోబైడెన్ ఇదివరకే హామీ ఇచ్చారు.

అమెరికా శివార్లలో పెరుగుతున్న శరణార్థులు, మెక్సికో నుంచి వేలాదిగా వస్తున్న పిల్లలు
Follow us on

ఇతర దేశాల నుంచి తమ దేశంలోకి చట్టవిరుధ్దంగా ప్రవేశిస్తున్నవారి పట్ల తాము జాలి, దయా గుణాలతో వ్యవహరిస్తామని, మానవత్వంతో వారిని ఆదుకుంటామని అధ్యక్షుడు జోబైడెన్ ఇదివరకే హామీ ఇచ్చారు. ఇమిగ్రేషన్ పాలసీని సరళతరం చేస్తామన్నారు. అయితే ఆ హామీ ఇప్పుడు ఆయన ప్రభుత్వానికే ఇరకాట పరిస్థితిని కల్పించింది. ముఖ్యంగా పొరుగునున్న మెక్సికో నుంచి వేలాది  శరణార్థులు అక్రమంగా అమెరికా చేరుతున్నారు. వీరిలో పిల్లలు అత్యధికంగా ఉన్నారు. యూఎస్-మెక్సికో సరిహద్దుల్లో గత రెండు వారాల్లో వీరి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఫెడరల్ ఇమిగ్రేషన్ ఏజెన్సీ వార్త ప్రకారం సుమారు మూడున్నర వేలమంది పిల్లలు ఈ శివార్లలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరినీ జైళ్ల వంటి శిబిరాలకు తరలిస్తున్నారు. చట్ట ప్రకారం వీరు మూడు రోజులకు పైగా ఈ శిబిరాల్లో ఉండరాదు. కానీ అలా జరగడం లేదు. రోజుల తరబడి వీరిని ఉంచవలసి రావడంతోను, ప్రతి రోజూ వందలాది మంది బాలలు సరిహద్దులు దాటి వస్తుండడంతోను ఏం చేయాలో అధికారులకు తెలియడంలేదు.

ఆరోగ్య, హ్యూమన్ సర్వీసెస్ డిపార్ట్ మెంట్ నిర్వహించే షెల్టర్లకు వీరిని తరలించాల్సి ఉంటుంది. కానీ కరోనా పాండమిక్ కారణంగా ఈ షెల్టర్లలో పరిమితంగా మాత్రమే పిల్లలకు అనుమతి ఉంటుంది. ఈ విధంగా రోజురోజుకీ అక్రమంగా శరణస్థుల కుటుంబాల వలసలు పెరిగిపోతున్న కారణంగానే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన ప్రభుత్వ హయాంలో ఇమిగ్రేషన్ సిస్టం ని కఠినతరం చేశారు. ఇతర దేశాల నుంచి  తమ దేశంలోకి ప్రవేశిస్తున్న వారి  సంఖ్యను కట్టడి చేసేందుకు ఆయన బ్యాన్ విధించారు. పైగా అమెరికా-మెక్సికో బోర్డర్లో ఏకంగా లక్షల డాలర్ల వ్యయంతో గోడను కట్టేందుకు సిధ్ధపడ్డారు. దీంతో కొంతవరకు శరణార్ధుల  సంఖ్య తాత్కాలికంగా తగ్గినప్పటికీ.. జోబైడెన్ అధ్యక్షుడు కాగానే మళ్ళీ వీరి తాకిడి పెరిగింది. పైగా  వీరిపట్ల తాము మానవతా దృక్పథంతో వ్యవహరిస్తామని ఆయన చేసిన ప్రకటన కూడా ఇందుకు కారణమైంది. మెక్సికో నుంచి చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్నవారి పట్ల బైడెన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది  సస్పెన్స గా మారింది. పైగా రిపబ్లికన్లు కూడా ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు, బైడెన్ ప్రభుతాన్ని ఇరకాటానా పెట్టేందుకు సమాయత్తమవుతున్నారు.  ఇమిగ్రేషన్ సిస్టం ని ప్రక్షాళన చేస్తామని ప్రకటించారని, మొదట ఈ అమాయక బాలల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

Maha Shivaratri: మహాశివరాత్రి పూజా చేస్తున్నారా ? పూజా సమయంలో పాటించవలసిన నియమాలెంటో తెలుసా..

Crystal Clear River : ఆ నది అడుగు భాగంలో రాళ్లు, చేపలను కూడా స్పష్టంగా చూడొచ్చు.. అంత స్వచ్ఛమైన నది ఎక్కడుందంటే..!