సెలవులు ముగించుకుని ఆఫీసుకు తిరిగొచ్చిన ఓ మేనేజర్‌కు ఊహించని షాక్ తగిలింది. హడావిడిగా ఆఫీసులో అడుగుపెట్టిన అతను ఏవో ఫైల్స్ కోసం టేబుల్ డ్రా ఓపెన్ చేశాడు. అందులో ఫైల్స్ తీయగానే అక్కడ కనిపించింది చూసి అతనికి వెన్నులో వణుకు పుట్టింది. వెంటనే అక్కడ్నుంచి బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఆస్ట్రేలియాలో బార్‌లో మేనేజర్‌గా పనిచేసే ఓ వ్యక్తి తన పర్సనల్ పనుల కోసం కొన్ని రోజులు సెలవు తీసుకున్నాడు. తన పనులు ముగించుకుని తిరిగి ఆఫీస్‌కు వచ్చాడు. చాలా రోజుల వరకు అతడి డెస్క్ ఖాళీగానే ఉండిపోయింది. మనుషుల కదలికలు లేకపోవడంతో ఆ డెస్క్ డ్రాయర్‌లో ఓ పాము తిష్ట వేసింది. మేనేజర్ వెళ్లి తన ఫైళ్ల కోసం డెస్క్ తెరవగానే అతడికి అందులో పాము దర్శనమిచ్చింది. విషయం తెలిసి అక్కడిక ఇచేరుకున్న ఆఫీసు సిబ్బంది స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్ 24/7 వారు సేఫ్‌గా పామును బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఈ వీడియోను సదరు స్నేక్ క్యాచర్ వారే ఫేస్‌బుక్లో పోస్ట్ చేశారు. దాంతో వీడియో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..