Bangladesh violence: బంగ్లాదేశ్‌లో హింసాత్మకంగా మారిన నిరసనలు.. హిందూ దేవాలయాలపై దాడులు.. ఇప్పటివరకూ 11 మంది మృతి

|

Mar 29, 2021 | 4:42 AM

Violence in Bangladesh: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన అనంతరం బంగ్లాదేశ్‌లో హింస చెలరేగుతోంది. బంగ్లాదేశ్‌ 50వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ప్రధాని మోదీ శుక్ర, శనివారాల్లో బంగ్లాదేశ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. మోదీ

Bangladesh violence: బంగ్లాదేశ్‌లో హింసాత్మకంగా మారిన నిరసనలు.. హిందూ దేవాలయాలపై దాడులు.. ఇప్పటివరకూ 11 మంది మృతి
Bangladesh Violence
Follow us on

Violence in Bangladesh: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన అనంతరం బంగ్లాదేశ్‌లో హింస చెలరేగుతోంది. బంగ్లాదేశ్‌ 50వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ప్రధాని మోదీ శుక్ర, శనివారాల్లో బంగ్లాదేశ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. మోదీ పర్యటనను నిరసిస్తూ ఇస్లామిక్‌ వాదులు శుక్రవారం నుంచి చేపట్టిన ఆందోళనలు ఆదివారం ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. వందలాది మంది ఇస్లామిక్ వాదులు బంగ్లాదేశ్‌లోని హిందూ దేవాలయాలపై, రైళ్లపై దాడులకు పాల్పడ్డారు. శుక్రవారం నుంచి కొనసాగుతున్న ఈ నిరసనలు హింసాత్మక మారడంతో ఇప్పటివరకూ 11 మంది మృతి చెందినట్లు బంగ్లాదేశ్ పోలీసులు వెల్లడించారు. చాలామంది గాయపడ్డారని తెలిపారు.

మోదీ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో భారత్‌లో ముస్లింలపై వివక్ష పెరుగుతోందని ఆరోపిస్తూ.. హిఫాజత్‌-ఎ-ఇస్లాం ఆధ్వర్యంలో వందలాది మంది ఆందోళనకారులు నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో హిందూ దేవాలయాలపై దాడులకు తెగబడ్డారు. దీంతోపాటు ఆందోళనకారులు బస్సులకు, రైళ్లకు నిప్పంటించారు. బ్రాహ్మణ్‌బరియాలో ఓ రైలింజన్‌ను ధ్వంసం చేసి.. బోగీలన్నింటికీ నిప్పుపెట్టారు. ఈ దాడిలో 10 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. రాజ్‌షాహీలో రెండు బస్సులను తగులబెట్టారు. రాజధాని నగరం ఢాకా సహా.. పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై రాళ్లదాడికి దిగాడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను ఉపయోగించారు. దీంతోపాటు ఫైరింగ్ కూడా జరిపారు.

ఇదిలాఉంటే.. బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ .. పాకిస్తాన్ నుంచి బంగ్లా విముక్తి పోరాటంలో తాను కూడా పాల్గొన్నానని చెప్పిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం తాను సత్యాగ్రహం కూడా చేశానని.. జైలుకు సైతం వెళ్లానని చెప్పారు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. పలువురు నెటిజన్లు ప్రధానిని ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

Also Read:

Supreme Court: విడాకులిచ్చిన భర్తకు సుప్రీం షాక్.. రూ.2.60 కోట్ల భరణం చెల్లించాలని ఆదేశాలు.. లేకపోతే..

మయన్మార్‌‌లో మారణహోమం.. సైన్యం కాల్పుల్లో 114 మంది బలి.. అంతర్జాతీయంగా వెల్లువెత్తిన నిరసన