
Bangladesh: బంగ్లాదేశ్‌లోని దుర్గా పూజా మండపాలలో విగ్రహాల మధ్య ఖురాన్ ఉంచడం ద్వారా హిందువులపై దాడుల కుట్రను పోలీసులు చేదించారు. బంగ్లాదేశ్ పోలీసులు కొమిల్లా పట్టణంలోని మండపం చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సహాయంతో ఖురాన్ ఉంచిన వ్యక్తిని గుర్తించారు. నగరంలోని సుజానగర్ ప్రాంతానికి చెందిన ఇక్బాల్ హుస్సేన్ (35 సంవత్సరాలు) గా ఆ వ్యక్తిని గుర్తించారు. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. హుస్సేన్‌కు మద్దతు ఇచ్చిన ఇద్దరు సహచరులను కూడా పోలీసులు గుర్తించారు. వారి పేర్లు ఫయాజ్, ఇక్రమ్ హుస్సేన్ అని పోలీసులు పేర్కొన్నారు. వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 41 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో, ఫయాజ్, ఇక్రమ్‌తో సహా నలుగురు వ్యక్తులు హుస్సేన్ సహచరులుగా గుర్తించబడ్డారు. మొత్తం కుట్రను కనుగొన్న తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పోలీసులను ఆదేశించారు.
అక్టోబర్ 13 న కొమిల్లా పట్టణం నుండి ప్రారంభమైన హిందువులపై దాడులు బంగ్లాదేశ్ అంతటా అక్టోబర్ 17 వరకు కొనసాగాయి. ఈ సమయంలో విస్తృతంగా హింస జరిగింది. దుర్గా మండపాలను కూల్చివేశారు. హిందువుల ఇళ్లు కాలిపోయాయి. హిందువులపై దాడి జరిగింది. ఈ హింస ఇంకా పూర్తిగా ఆగలేదు.
ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జమాత్ కుట్ర
ఢాకా వాచర్స్ నివేదిక ప్రకారం.. షేక్ హసీనా ప్రభుత్వంపై జమాతే-ఇ-ఇస్లామీ బంగ్లాదేశ్ ప్రణాళికాబద్ధమైన కుట్ర అని అధికార పార్టీ నమ్ముతోంది. దీనిని నిర్ధారించుకోవడం కోసం ఇంకా ఆధారాలు సేకరిస్తున్నారు. జమాత్ లక్ష్యం బంగ్లాదేశ్‌లో తాలిబాన్ లాగా పూర్తి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడమే.
ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం , మసీదు నుండి దుర్గా మండపం వరకు ఖురాన్ తీసుకువెళుతున్న దృశ్యాలు ననువా దిగిర్‌లోని పూజ పండల్ చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలో లభించాయి. అందులో పూర్తిగా ఇక్బాల్ హుస్సేన్ కనిపించాడు. ఒక ఫుటేజ్‌లో, అతను స్థానిక మసీదు నుంచి ఆకుపచ్చ వస్త్రంతో కప్పబడిన ఖురాన్‌తో బయలుదేరిన తర్వాత పూజ మండపాల్లోకి ప్రవేశించడం కనిపిస్తుంది. దీని తరువాత అతను హనుమంతుని విగ్రహం దగ్గర నడుస్తూ కనిపించాడు. హుస్సేన్‌ను పోలీసులు ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది.
హుస్సేన్ ఖురాన్‌ను ఉంచాడు, ఫయాజ్ ప్రజలను రెచ్చగొట్టాడు
మీడియా నివేదిక ప్రకారం, పోలీసులు మొత్తం కుట్రపై సమగ్ర దర్యాప్తు చేశారు. హుస్సేన్ ఖురాన్‌ను మండపంలో ఉంచాడని ఒక పోలీసు అధికారి చెప్పారు. దీని తరువాత, ఫయాజ్ తన కమ్యూనిటీకి చెందిన ప్రజలను అక్కడ ప్రేరేపించాడు. దీని తరువాత, ఈక్రమ్ 999 అత్యవసర సేవకు కాల్ చేసి, పూజ మండపంలోని ఖురాన్ ఉనికి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ననువా దిగిర్ పూజ వేడుకల కమిటీ అధ్యక్షుడు సుబోధ్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ మేము పవిత్ర ఖురాన్ చూడలేదు. అకస్మాత్తుగా ఇద్దరు యువకులు వచ్చి, “పూజ మండపంలో ఖురాన్ కనిపించింది.. పూజ మండపంలో ఖురాన్కనిపించింది..” అని అరవడం ప్రారంభించారు. ఆ తర్వాత గొడవ మొదలైంది అని చెప్పారు.
ఫయాజ్ ఫేస్‌బుక్ లైవ్ చేసాడు..
ఫయాజ్ తర్వాత ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో చేసాడు. దీనిలో అతను ఈ మొత్తం సంఘటన వివరాలను చాలా రెచ్చగొట్టే విధంగా చెప్పాడు. ఈ వీడియో తర్వాత, బంగ్లాదేశ్‌లోని ఇతర ప్రాంతాలలో కూడా పూజల మండపాలు, హిందువుల ఇళ్లపై దాడుల సంఘటనలు ప్రారంభమయ్యాయి.
బంగ్లాదేశీ కాదు, సౌదీ అరేబియాలోని ఖురాన్..
పోలీసు అధికారి కూడా కోమిల్లాలోని పూజ మండపం లోపల వినాయకుని పాదాల కింద ఉన్న ఆకుపచ్చ వస్త్రంతో చుట్టబడిన ఖురాన్ బంగ్లాదేశ్‌లో ముద్రించబడలేదని చెప్పాడు. ఫయాజ్ సౌదీ అరేబియాలో ముద్రించిన ఈ ఖురాన్ తెచ్చాడు. అదేవిధంగా అది అతని వ్యక్తిగత ఖురాన్. పోలీసు అధికారి ప్రకారం, ఫయాజ్ గత సంవత్సరం సౌదీ అరేబియా నుండి బంగ్లాదేశ్‌కు వచ్చాడు. కొమిల్లాలో మొబైల్ సేవా దుకాణాన్ని ప్రారంభించాడు. ఖురాన్ సౌదీ అరేబియా నుండి వచ్చినందున దీనిని కుట్రలో భాగంగా పోలీసులు కూడా పరిశీలిస్తున్నారు.
ఈ విషయంపై దాస్‌గుప్త మాట్లాడుతూ హిందువులను దేశం నుంచి తరిమికొట్టడానికి ప్రస్తుతం జరిగిన పెద్ద కుట్ర. ఈ దేశంలో మైనారిటీలు జీవించాలని మతతత్వ శక్తులు కోరుకోవడం లేదు అని చెప్పారు. ఈ విషయాలు గణాంకాల ద్వారా రుజువు అవుతున్నాయి. పాకిస్తాన్ ఏర్పడిన సమయంలో, హిందువుల జనాభా 29.7%. బంగ్లాదేశ్ ఏర్పడిన సమయంలో ఇది 20% గా ఉంది. ఇప్పుడు అది 9% గా ఉంది. బంగ్లాదేశ్ సృష్టించబడినప్పుడు, పాకిస్తాన్ సైన్యం హిందువులను ఊచకోత కోసి, తరిమికొట్టింది.
ఇవి కూడా చదవండి: Multibagger Stock Tips: ఏడాదిలో కళ్లు చెదిరే లాభాలు.. ఈ షేర్లు మాములుగా లేవుగా.. పెట్టుబడిదారులకు డబ్బులే డబ్బులు!
Car Safety Features: కారు భద్రతకు ఈ ఫీచర్లు ఎంతో అవసరం.. మీ కారులో ఇవి ఉన్నాయా మరి..!
Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..