Bus Accident: మినీ బస్సును ఢీకొట్టిన రైలు.. విద్యార్థులు సహా11 మంది మృతి

|

Jul 30, 2022 | 6:35 PM

ఈ మేరకు కేసు నమోదు చేసిన మిర్షారాయ్ స్టేషన్‌ పోలీస్‌ అధికారి కబీర్ హుస్సేన్ తెలిపారు. ఈ క్రమంలోనే క్రాసింగ్ గేట్‌మెన్ సద్దాం హుస్సేన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Bus Accident: మినీ బస్సును ఢీకొట్టిన రైలు.. విద్యార్థులు సహా11 మంది మృతి
Bus Accident
Follow us on

Bus Accident: ఓ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ఒక మినీ బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మైక్రోబస్సును ఢీకొట్టిన రైలు కనీసం ఒక కిలోమీటరు దూరం లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో మైక్రోబస్‌లోని 11 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

చిట్టగాంగ్‌లోని మిర్షారాయ్ ఉపజిల్లాలో శుక్రవారం విద్యార్థులు, కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్న మినీబస్సును ఢాకా వైపు వెళ్తున్న ప్రోవతి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. దాంతో ఏడుగురు విద్యార్థులు సహా 11 మంది మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను చిట్టగాంగ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. మరణించిన ఏడుగురు విద్యార్థులు దాదాపు ఒకే వయస్సు గల వారిగా గుర్తించారు. వారిలో నలుగురు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు.

ఈ మేరకు కేసు నమోదు చేసిన మిర్షారాయ్ స్టేషన్‌ పోలీస్‌ అధికారి కబీర్ హుస్సేన్ తెలిపారు. ఈ క్రమంలోనే క్రాసింగ్ గేట్‌మెన్ సద్దాం హుస్సేన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి 5 మంది సభ్యుల బృందాన్ని నియమించారు. కమిటీ తన నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని కోరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి