చేతిలో గన్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.. కట్‌ చేస్తే.. క్లైమాక్స్‌లో షాకిచ్చాడు..!

బ్యాంకాక్‌లో దారుణం వెలుగు చూసింది. సోమవారం థాయ్ రాజధానిలోని ఒక సూపర్‌ మార్కెట్‌లోకి చొరబడిన ఆగంతకుడు ఐదుగురిపై కాల్పులు జరిపి.. ఆ తరువాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన చతుచక్ మార్కెట్ సమీపంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో చోటుచేసుకుంది.

చేతిలో గన్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.. కట్‌ చేస్తే.. క్లైమాక్స్‌లో షాకిచ్చాడు..!
Bangkok Firings

Updated on: Jul 28, 2025 | 4:13 PM

బ్యాంకాక్‌లో దారుణం వెలుగు చూసింది. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన చతుచక్ మార్కెట్ సమీపంలోని ఒక సూపర్‌మార్కెట్‌లోకి ప్రవేశించిన ఒక దుండగుడు అక్కడున్న వారిపై ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు సెక్యూరిటీ గార్డులుతో పాటు ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. అయితే వాళ్లని కాల్చి చంపిన తర్వాత  కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్టు స్థానిక మీడియాలు వెల్లడించాయి. బ్యాంకాక్ పోస్ట్ వార్తాపత్రిక నివేదిక ప్రకారం..ఒక వ్యక్తి అకాస్మాత్తుగా మార్కట్‌లోకి దూరి కాల్పులకు తెగబడ్డట్లు తెలస్తోంది. ఒక్కసారిగా కాల్పుల శబ్ధం విన్న స్థానికులు భయపడిపోయారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నల్లటి టీ-షర్ట్, కామోఫ్లాజ్ షార్ట్స్ ధరించి మార్కెట్ భవనం లోపల ఒక బెంచ్ మీద నిందితుడు చనిపోయి కనిపించాడని పోలీసులు తెలిపారు. మృతుడిని వద్ద ఉన్న ఐడీకార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆధారంగా అతను నాఖోన్ రాట్చసిమాలోని ఖోంగ్ జిల్లాకు చెందిన 61 ఏళ్ల నోయి ప్రైదేన్‌గా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత గాయపడిన వారితో అక్కడున్న మృతదేహాలను హాస్పిటల్‌కు తరలించారు.

ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దాడి వెనుక గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బ్యాంకాక్‌లో కాల్పుల ఘటన నేపథ్యంలో ప్రజలు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అయితే గత కొన్నేళ్లుగా ఇక్కడ కాల్పులు జరుగుతన్న ఘటనలు ఎక్కవగా నమోదవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే థాంగ్ జిల్లాలోని ఒక పాఠశాల సమీపంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు చనిపోవడం తీవ్ర కలకలం రేపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.