కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఒకే చెప్పిన బెహరిన్.. వ్యాక్సిన్ ఆమోదంతో రెండవ స్థానంలోకి….

|

Dec 05, 2020 | 12:56 PM

ఫైజర్-బయోటెక్ కరోనా వ్యాక్సిన్‏ను అత్యవసర వినియోగానికి బెహరిన్ ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్‏కు వినియోగానికి ఒకే చెప్పిన దేశాలలో బ్రిటన్

కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఒకే చెప్పిన బెహరిన్.. వ్యాక్సిన్ ఆమోదంతో రెండవ స్థానంలోకి....
Follow us on

ఫైజర్-బయోటెక్ కరోనా వ్యాక్సిన్‏ను అత్యవసర వినియోగానికి బెహరిన్ ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్‏కు వినియోగానికి ఒకే చెప్పిన దేశాలలో బ్రిటన్ మొదటి స్థానంలో ఉండగా, రెండవ దేశంగా బెహరిన్ నిలిచింది. ఫైజర్ బయోటెక్ వ్యాక్సిన్‏ కరోనా కట్టడికి ఉపయోగపడుతుందని నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ సీఈవో మారియమ్ అల్ జలాహ్మా తెలిపారు. యూఎస్ ఔషద కంపెనీ, జర్మన్ బయోటెక్ ఇంకా ఈ వ్యాక్సిన్‏ను ఎప్పుడు ప్రారంభిస్తాయో మనమా పేర్కొనలేదు. ప్రస్తుతానికి కరోనా నియంత్రణకు ఈ వ్యాక్సిన్‏ను ఆమోదించినట్లు, వచ్చే వారం నుంచి దీనిని ప్రారంభించనున్నట్లు బ్రిటన్ బుదవారం ప్రకటించింది.

అటూ బెహరిన్ నవంబర్‏లో… చైనాకు చెందిన సినోఫార్మ్ టీకాను ఫ్రంట్ లైన్ హెల్త్ కెర్ వర్కర్స్ పై ప్రయోగించడానికి ఆమోదం తెలిపింది. ఆ దేశంలో ప్రస్తుతానికి 87 వేలకుపైగా కొవిడ్ కేసులు నమోదు కాగా, 341 మంది మృతి చెందారు. ఫైజర్-బయోటెక్ వ్యాక్సిన్ అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని బ్రిటన్ శుక్రవారం ప్రకటించింది. చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచం మొత్తంలో 105 మిలియన్ల మందిని బలితీసుకుంది. అంతే కాకుండా 65 మిలియన్ల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు.