Salman Rushdie: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి జరిగింది. శుక్రవారం అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ వేదికలో పాల్గొన్న సల్మాణ్ దాడి జరిగింది. రష్దీపై కత్తితో పొడిచినట్లు సాక్షులు తెలిపారు. ది సాటానిక్ వెర్సెస్‌ను రాసిన తర్వాత ఈయనను చంపుతామని బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు ఈ దాడి జరగడంతో ఒక్కసారి అందరూ ఉలిక్కిపడ్డారు. ఈ మాజీ బుక్ ప్రైజ్ విజేత న్యూయార్క్‌లోని చౌటుక్కా ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతోన్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ దాడి నుంచి సల్మాన్ రష్దీ స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
— RT (@RT_com) August 12, 2022
ఇవి కూడా చదవండి
సల్మాన్ రష్దీ 1988లో ది సానాటిక్ వెర్సెస్ అనే పుస్తకం రాసిన తర్వాత అతనికి హత్య బెదిరింపులు మొదలయ్యాయి. అప్పట్లో యూకేలో ఈ నవలలను దహనం చేశారు. పాకిస్తాన్ కూడా ఈ పుస్తకాన్ని నిషేధించింది. 1989లో ఇరాన్‌కి చెందని అయతుల్లా ఖొమేనీ ఫత్వా జారీ చేశారు. ముస్లింలు నిరాకరించిన ప్రవచనాలను బయట పెట్టినందుకు అతన్ని హత్య చేయాలని ఫత్వా జారీ చేశారు. భారత సంతతికి చెందిన సల్మాన్ రష్దీ ప్రస్తుతం ఇంగ్లండ్ పౌరసత్వం తీసుకున్నాడు. తాజాగా అమెరికాలో ఈయనపై దాడి జరగడంతో మరోసారి సల్మాన్ పేరు ప్రపంచవ్యాప్తంగా మోరుమోగుతోంది.