భారత్ ను ఇబ్బంది పెట్టె విధంగా డ్రాగన్ కంట్రీ కి ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా వదిలి పెట్టాడు. అసలు చెప్పాలంటే.. భారత్ ను ఇబ్బంది పెట్టడానికి సరిహద్దు ప్రాంతం దగ్గర మాత్రమే కాదు. ఈశాన్య ప్రాంతాల్లోని అస్సాం తమదిగా తరచుగా చెబుతూ.. తమ దేశ విస్తరణ కాంక్షను వెల్లడిస్తునే ఉంది. అయితే తాజాగా మరోసారి ఆసియా గేమ్స్ మాటున భారత్ ను రెచ్చగొట్టే చర్యలకు దిగింది చైనా. భారత్ వుషు టీంకు చెందిన ముగ్గురు అరుణాచల్ ప్రదేశ్ ప్లేయర్స్‌ను వెనక్కి పంపింది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూబాగంలో అంతర్భాగమంటూ యుద్ధానికి కవ్విస్తుంది.
మరోసారి చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడలకు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు భారత వుషు ఆటగాళ్ల ప్రవేశాన్ని డ్రాగన్ కంట్రీ రద్దు చేసింది. వారి వీసాలను, అక్రిడేషన్‌ను రద్దు చేసింది. దీంతో ఆసియా గేమ్స్‌లో అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా నిరాకరించడంపై భారత్ మండిపడింది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖామంత్రి అనురాగ్ ఠాగూర్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆటగాళ్లను రాకుండా ఆపడం ఆసియా గేమ్స్ నిబంధనలకు విరుద్ధమని మండిపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో భాగమని స్పష్టం చేశారు అనురాగ్ ఠాకూర్. చైనా కవ్వింపు చర్యలను ఖండించారు.
ఇదే విషయంపై భారత విదేశాంగ శాఖ చైనా తీరు తప్పుబట్టింది. ప్రాంతీయత ఆధారంగా ఆటగాళ్ల ప్రవేశాన్ని రద్దు చేయడమేంటని మండిపడింది. వివక్షను భారత్ అంగీకరించబోదని స్పష్టం చేసింది. భారత్‌లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆటగాళ్ల ప్రవేశాన్ని చైనా రద్దు చేయడం ఆసియా గేమ్స్ నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. చైనా తీరుపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. వివక్షకు గురైన భారత ఆటగాళ్లను ఢిల్లీకి తీసుకువచ్చింది. మరోవైపు ఇదే విషయంపై ఆసియా గేమ్స్‌ను నిర్వహించే అత్యున్నత కమిటీ స్పందించింది. ఈ ఘటనను ఆసియా ఒలింపిక్ కమిటీకి తీసుకువెళ్లినట్లు తెలిపింది.
త్వరలో సమస్య పరిష్కారమవుతుందని ఆశించింది. భారత ఆటగాళ్ల ప్రవేశాన్ని రద్దు చేయడంపై చైనా విదేశాంగ శాఖ మంత్రి మావో నింగ్ స్పందించారు. అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ప్రభుత్వం గుర్తించలేదు. ఆ భూభాగం చైనాకు చెందిన జియాంగ్ ప్రాంతంలో ఉందని చెప్పారు మావో. అది చైనాలో అంతర్భాగమని తెలిపారు. ఇదిలా ఉంటే ఏడుగురు ఆటగాళ్లు, సిబ్బందితో కూడిన మిగిలిన భారతీయ వుషు జట్టు హాంకాంగ్‌కు వెళ్లింది. అక్కడి నుంచి చైనాలోని హాంగ్‌జౌకు చేరుకుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..