చైనా(China) లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరో బ్లాక్‌బాక్స్(Black Box) లభ్యమైంది. దీని ద్వారా ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ (సీఈఏ)కు చెందిన ఈ విమానంలో కాక్‌పిట్, తోకభాగంలో రెండు బ్లాక్ బాక్సులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాక్‌పిట్ భాగంలో అమర్చిన బ్లాక్ బాక్స్ నాలుగు రోజుల క్రితమే లభ్యం కాగా.. తాజాగా మరొకటి కూడా దొరకడంతో ప్రమాదానికి సంబంధించిన కీలక వివరాలు(Information) తెలుసుకోవచ్చు. బ్లాక్ బాక్స్ కోసం వందలాది మంది సిబ్బంది వివిధ పనిముట్లతో నేలను తవ్వుతూ సహాయక చర్యలు కొనసాగించారు. ఈ క్రమంలో వర్షం, బురద అడ్డంకిగా మారాయి. అయినప్పటికీ గాలింపు ఆపలేదు. ఎట్టకేలకు 1.5 మీటర్ల లోతులో రెండో బ్లాక్ బాక్స్‌ను గుర్తించారు. మరణించివారిలో 120 మంది డీఎన్‌ఏలను అధికారులు ధ్రువీకరించారు. అలాగే ఘటనా స్థలంలో మృతులకు సంబంధించిన బ్యాంకు కార్డులు, ఇతర గుర్తింపు కార్డులు లభించాయి.
ఘటన తర్వాత చైనా ఈస్టర్న్‌తో పాటు దాని అనుబంధ సంస్థలు 200 బోయింగ్ 737-800 విమానాలను అధికారులు రద్దు చేశారు. కేవలం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని విమానాల్లో ఎలాంటి సమస్య లేదని విమానయాన సంస్థ తెలిపింది. మరోవైపు ఘటనకు దారితీసిన కారణాలను తెలుసుకోవడంపై జరుగుతున్న దర్యాప్తునకు అన్ని రకాలుగా సహకరిస్తున్నామని బోయింగ్ ఓ ప్రకటనలో పేర్కొంది.
Also Read
Viral: ఆన్లైన్ గేమ్స్ ఆడి.. ఆడి మతి పోయింది.. రోడ్డుపైకి వెళ్లి వింత అరుపులు.. చివరకు ఇలా..
Artillery Centre Jobs: హైదరాబాద్ ఆర్టిలెరీ సెంటర్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 80 వేలకుపైగా జీతం..