భారత ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ పర్యటన కొనసాగుతోంది. ఆయన తొలిసారి పోలాండ్ చేరుకున్న నేపథ్యంలో అక్కడ నివాసముంటున్న తెలుగువారు పీఎం మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ముందుకు వచ్చారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు భారత ప్రధాని మోదీ రాకతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టీడీపీ జెండాలతో ఘన స్వాగతం పలికారు. దీంతో ఆ ప్రాంతమంతా మోదీ నామ స్మరణతో మార్మోగిపోయింది. పెద్ద ఎత్తున చేరుకున్న తెలుగు తమ్ముళ్లు మోదీతో మాట్లాడేందుకు, ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఇదిలా ఉంటే భారత్, పోలెండ్ ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలో స్వయంగా పర్యటించి వివిధ అంశాలపై ఆ దేశాధినేతలతో చర్చించనున్నారు. గత 45 ఏళ్లలో పోలాండ్ వెళ్లిన మొదటి భారత ప్రధానిగా సరికొత్త రికార్డు నెలకొల్పారు పీఎం మోదీ. పోలాండ్ పర్యటనలో భాగంగా జామ్ సాహెబ్ ఆఫ్ నవనగర్ మెమోరియల్‌ను సందర్శించనున్నారు ప్రధాని మోదీ.
పోలాండ్, ఉక్రెయిన్‌లలో రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ బుధవారం వార్సా చేరుకున్నారు. పోలాండ్ వాసులకు ఆశ్రయమిచ్చిన ఈ మొమోరియల్‌ను పోలాండ్ రాజధాని వార్సాలో ఏర్పాటు చేశారు. పర్యటనలో భాగంగా జామ్ సాహెబ్ ఆఫ్ నవనగర్ మెమోరియల్‌ను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆగస్టు 23న స్పెషల్ ట్రైన్‌లో కీవ్ చేరుకోనున్నారు. ఇండియా నుంచి పోలాండ్ బయలుదేరే ముందు, పీఎం మోదీ కొన్ని విషయాలు వెల్లడించారు. భారత్ మిత్ర దేశంగా ఉన్న పోలాండ్ శాంతి భద్రతలు స్థిరంగా ఉండాలని, పలు అంశాలపై ఆ దేశాధినేతలతో చర్చించి త్వరగా తిరిగి రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. తన ఈ పోలాండ్ పర్యటనలో భాగంగా రాబోయే రోజుల్లో ఇరుదేశాల మధ్య దౌత్యం మరింత బలంగా, శక్తివంతమైనదిగా మారుతుందని.. అందుకు ఈ పర్యటన పునాది అని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పోలాండ్‌లో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా పీఎం మోదీ”వైబ్రెంట్” ఇండియన్ కమ్యూనిటీ సభ్యులతో కూడా చర్చిస్తారు. ఆ తరవాత ఉక్రెయిన్ బయలుదేరి వెళ్లనున్నారు.
Landed in Poland. Looking forward to the various programmes here. This visit will add momentum to the India-Poland friendship and benefit the people of our nations. pic.twitter.com/KniZnr4x8g
— Narendra Modi (@narendramodi) August 21, 2024
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..