ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా గిన్నిస్ రికార్డు.. ఆమె వయస్సు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
117 సంవత్సరాల 168 రోజుల కాలం పాటు ఆమె జీవించారు. మరియా చిన్నతనంలోనే ఆమె కుటుంబం స్పెయిన్ కు వెళ్లి అక్కడే స్థిరపడింది. ఆమె తన జీవిత కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూసింది. అంతేకాదు..ఇటీవల ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారిని సైతం ఎదిరించి నిలబడ్డారు.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా పేరున్న మరియా బ్రన్యాస్ మోరేరా ఇటీవల మృతి చెందారు. మరియా బ్రన్యాస్ 1907 మార్చి 4న అమెరికాలో జన్మించారు. 117 సంవత్సరాల 168 రోజుల కాలం పాటు ఆమె జీవించారు. మరియా చిన్నతనంలోనే ఆమె కుటుంబం స్పెయిన్ కు వెళ్లి అక్కడే స్థిరపడింది. ఆమె తన జీవిత కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూసింది. అంతేకాదు..ఇటీవల ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారిని సైతం ఎదిరించి నిలబడ్డారు.
అయితే ఇప్పుడు ఆమె మృతి చెందారు. ఇటీవల ఆమె మరణించినట్టుగా మరియా కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇదిలా ఉంటే మరియా మరణంతో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా జపాన్‌కు చెందిన టొమికా ఇటూకా(116ఏళ్లు) ఆ స్థానాన్ని దక్కించుకున్నారు.
జపాన్‌కు చెందిన టొమికా ఇటూకా వయసు 116 సంవత్సరాలు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో టొమికా ఇటుకా చోటు సాధించారు. ఇటూకాకి పర్వతారోహకురాలిగా మంచి గుర్తింపు ఉంది. జపాన్ లోని 3,067 మీటర్ల ఎత్తైన మౌంట్ ఆన్టేక్ పర్వతాన్ని టొమికా ఇటూకా రెండు సార్లు అధిరోహించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..