Sun Temple in Egyptian: ఈజిప్టులో పురావస్తు శాఖ తవ్వకాల్లో మరో పురాతన సూర్య దేవాలయం వెలుగులోకి వచ్చింది. బయల్పడిన ఆలయం 4500 సంవత్సరాల పురాతనమైనదిగా చరిత్రకారులు చెబుతున్నారు . ముడి ఇటుకలతో నిర్మించిన ఈ భవనం అవశేషాలను పరిశీలిస్తే.. ఈ సూర్య దేవాలయం ఈజిప్టు 5వ రాజ్యానికి (క్రీ.పూ. 2465-2323) చెందినదిగా భావిస్తున్నారు. అయితే ఈజిప్టులో సూర్య దేవాలయ అవశేషాలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది కూడా నాలుగున్నర వేల ఏళ్ల నాటి సూర్య దేవాలయ అవశేషాలు లభించాయి. ఈజిప్టు పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఇన్స్టాగ్రామ్ లో ( Instagram) ఈ విషయాన్ని ప్రకటించింది. ఈజిప్టులో ఇటలీ, పోలాండ్ దేశాలు ఉమ్మడి పురావస్తు మిషన్ చెప్పారు. ఈ తవ్వకాల్లో భాగంగా సూర్య దేవాలయాల అవశేషాలు వెలుగులోకి వచ్చాయి.
ఈజిప్టు పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ జూలై 30న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. ఈజిప్టులో ఇటలీ , పోలాండ్ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ తవ్వకాల్లో భాగంగా సూర్య ఆలయ అవశేషాలు బయల్పడ్డాయి. రాజు నుస్సేరే కాలం నాటి దేవాలయంపై పురావస్తు శాఖ సంయుక్త బృందం పని చేస్తోంది. ఈ ఆలయం కింద ముడి ఇటుకలతో నిర్మించిన భవనం అవశేషాలు కనుగొనబడ్డాయి.
సూర్య దేవాలయం శిథిలాలు:
దక్షిణ కైరోలో బయల్పడిన ఆలయ శిధిలాలు
నివేదికల ప్రకారం.. ఈ 4,000 సంవత్సరాల పురాతన సూర్య దేవాలయం రాజధాని కైరోలోని దక్షిణ భాగంలో ఉన్న అబుసిర్ ప్రాంతంలో బయల్పడింది. ఇది కింగ్ నుస్సేర్.. ఆలయం కింద ఖననం చేయబడింది. పర్యాటక , పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ కూడా ఓ ప్రకటనలో ఈ ఆలయం 5 వ సామ్రాజ్యంలో కోల్పోయిన 4 సూర్య దేవాలయాలలో ఇది ఒకటి కావచ్చని పేర్కొంది. ఈ సూర్య దేవాలయం గురించి చరిత్ర పుస్తకాల్లో ప్రస్తావిన ఉందని పేర్కొంది.
భవనం లోపల మట్టి కుండలు:
5 వ సామ్రాజ్యంలోని ఆరవ పాలకుడి కోరిక మేరకు సూర్య దేవాలయంతో పాటు.. తన ఆలయాన్ని నిర్మించాడు. తవ్వకాల్లో భవనం లోపల కొన్ని మట్టి కుండలు, గాజులు కూడా లభించాయి. అంతేకాదు.. భూమిలో పాతిపెట్టిన కొన్ని స్టాంపులు కూడా బయల్పడ్డాయి. ఆ స్టాంప్స్ పై 5 వ సామ్రాజ్యానికి చెందిన రాజుల పేర్లు ఉన్నాయి. ఇటలీ, పోలెండ్ పురావస్తు బృందం పని చేస్తున్న స్థలాల ఫోటోలను మంత్రిత్వ శాఖ షేర్ చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..