Ukraine-Russia Tension: రష్యా – ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్.. పుతిన్‌తో మాట్లాడిన జో బైడెన్.. ఏమన్నారంటే..?

Biden to speak with Putin: రష్యా-ఉక్రెయిన్‌ వివాదంపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్పందించింది. వివాదం పెరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనిక బందోబస్తుపై అధ్యక్షుడు జో బిడెన్ (Joe Biden) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో

Ukraine-Russia Tension: రష్యా - ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్.. పుతిన్‌తో మాట్లాడిన జో బైడెన్.. ఏమన్నారంటే..?
Joe Biden, Vladimir Putin

Updated on: Feb 13, 2022 | 3:04 AM

Biden to speak with Putin: రష్యా-ఉక్రెయిన్‌ వివాదంపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్పందించింది. వివాదం పెరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనిక బందోబస్తుపై అధ్యక్షుడు జో బిడెన్ (Joe Biden) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఇరుదేశాల నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా జో బైడెన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై (Ukraine Russia) రష్యా దండయాత్ర మరింత మానవ సంక్షోభానికి దారితీస్తుందని.. అదేవిధంగా రష్యాను కూడా ప్రమాదంలో పడేలా చేస్తుందని బిడెన్ పునరుద్ఘాటించారు. అయితే.. ఈ సమయంలో మిత్రదేశాలతో కలిసి అమెరికా నిర్ణయాత్మకంగా స్పందిస్తుందంటూ బైడెన్ పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేపడితే.. మానవ బాధలు పెరుగుతాయని.. ఈ సమయంలో తమ మిత్రదేశాలతో కలిసి యునైటెడ్ స్టేట్స్ నిర్ణయాత్మకంగా స్పందింస్తుందంటూ అధ్యక్షుడు బైడెన్.. పుతిన్‌ను హెచ్చరించారు. అయితే.. ఇరు దేశాల మధ్య దౌత్యంలో పాల్గొనడానికి యునైటెడ్ స్టేట్స్ సిద్ధంగా ఉందని.. కానీ పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తామని పుతిన్‌ (Vladimir Putin)తో అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే.. ఉక్రెయిన్‌పై రష్యా ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు సూచనలతో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని తన రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయనున్నట్టు తెలిపింది. అక్కడి అమెరికన్ దౌత్య సిబ్బంది దేశం విడిచి రావాలంటూ విదేశాంగ శాఖ ఆదేశించే ఛాన్స్‌ ఉందని అంటున్నారు అధికారులు. గతంలోనే తమ దౌత్యవేత్తల కుటుంబ సభ్యులు స్వదేశానికి చేరుకోవాలని కోరింది అమెరికా. సిబ్బంది విషయంలో మాత్రం వారి ఆలోచనకు వదిలివేసింది. కానీ, తాజాగా వారినీ రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు చర్చ జరుగుతోంది. కొంతమంది దౌత్యవేత్తలను పోలాండ్‌ సరిహద్దు సమీపంలోకి తరలించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

Also Read:

Karnataka Hijab Row: అంతర్జాతీయ స్థాయికి హిజాబ్‌ ఇష్యూ.. అగ్రరాజ్యం అమెరికా ఏమన్నదంటే..?

Hijab: హిజాబ్ మా దేశ అంతర్గత అంశం – మీ కామెంట్లు సరికాదు.. కేంద్రం కీలక వ్యాఖ్య