అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కోవిడ్-19 సోకింది. ఈ మేరకు వైట్‌హౌస్ సమాచారం ఇచ్చింది. బైడెన్‌లో కోవిడ్ -19 లక్షణాలు కనిపించాయి. త్వరగా కోలుకుని తిరిగి వస్తారు, ప్రస్తుతం క్వారంటెన్‌లో ఉన్న ఆయన, తన పనిని కొనసాగిస్తారని అధికారిక ప్రకటనలో తెలిపింది. 81 ఏళ్ల జో బైడెన్ బుధవారం (జూలై 17) కోవిడ్ పాజిటివ్ పరీక్షించారు. దీంతో సెల్ఫ్ ఐసోలేషన్ కోసం డెలావేర్‌లోని తన బీచ్ హౌస్‌కు వెళ్లారు. దీనికంటే ఒక రోజు ముందు, లాస్ వెగాస్‌లో జరిగిన నేషనల్ కన్వెన్షన్‌లో బైడెన్ పాల్గొన్నారు.
యుఎస్ ప్రెసిడెంట్ పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నారని, కోవిడ్ -19 బూస్టర్ డోస్ కూడా పొందారని వైట్ హౌస్ తెలిపింది. ఇటీవలి బూస్టర్ మోతాదు సెప్టెంబర్ 2023లో అందించినట్లు వెల్లడించింది. ఆ తర్వాత కూడా అతనికి కోవిడ్ సోకింది. అయినప్పటికీ, కోవిడ్ లక్షణాలు చాలా తేలికపాటివిగా ఉన్నట్లు, త్వరలోనే కోలుకుంటారని వైట్ హౌజ్ వర్గాలు పేర్కొన్నాయి. తనకు కోవిడ్ సోకినట్లు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తెలిపారు. “కోవిడ్ -19 బారిన పడ్డాను, కానీ నేను క్షేమంగా ఉన్నాను, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు. ఈ వ్యాధి నుండి కోలుకునేందుకు ఒంటరిగా ఉంటాను. ఈ సమయంలో కూడా అమెరికన్ ప్రజల కోసం పని చేస్తాను.” తాను స్వల్ప అస్వస్థతకు మాత్రమే గురయ్యానని బైడెన్ మరో ట్వీట్‌లో తెలిపారు.
I tested positive for COVID-19 this afternoon, but I am feeling good and thank everyone for the well wishes.
I will be isolating as I recover, and during this time I will continue to work to get the job done for the American people.— President Biden (@POTUS) July 17, 2024
బైడెన్‌కు శ్వాసకోశ లక్షణాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడి అధికారిక వైద్యులు వెల్లడించారు. జలుబు, దగ్గు, ఇతర సాధారణ రోగ లక్షణాలతో బాధపడుతున్నారని తెలిపారు. శ్వాస రేటు, ఊపిరి తీసుకునే రేటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు అన్నీ సాధారణ స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు. COVID-19 పరీక్ష నిర్వహించడంతో పాజిటివ్ వచ్చిందని. CDC మార్గదర్శకాలకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
కాగా, జో బైడెన్ చివరిసారిగా జూలై 2022లో కోవిడ్ బారిన పడ్డారు. ఇదిలావుంటే, అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, దేశంలో ఇటీవలి కాలంలో కోవిడ్ -19 కేసులు పెరిగాయి. గత వారంతో పోల్చితే జూలై 6తో ముగిసిన వారంలో 23.5 శాతం ఎక్కువ కోవిడ్ కేసులు నమోదయ్యాయని తాజా డేటా చూపుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..