Omicron Restrictions: ఒమిక్రాన్ దెబ్బ.. ఆంక్షల బాట పట్టిన అగ్ర రాజ్యాలు.. ఇకపై అలా అయితేనే ఎంట్రీ…

Omicron Restrictions: ఒమిక్రాన్‌ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా అగ్ర రాజ్యాలన్నీ ఆంక్షల బాట పడుతున్నాయి. తమతమ దేశ పౌరులను కాపాడుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి

Omicron Restrictions: ఒమిక్రాన్ దెబ్బ.. ఆంక్షల బాట పట్టిన అగ్ర రాజ్యాలు.. ఇకపై అలా అయితేనే ఎంట్రీ...
Omicron

Updated on: Dec 05, 2021 | 6:22 AM

Omicron Restrictions: ఒమిక్రాన్‌ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా అగ్ర రాజ్యాలన్నీ ఆంక్షల బాట పడుతున్నాయి. తమతమ దేశ పౌరులను కాపాడుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి పలు దేశాలు. ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.​తొలుత దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్, డిసెంబర్​1న అమెరికాలోకి అడుగుపెట్టింది. కాలిఫోర్నియాలో ఒమిక్రాన్​ కేసు నమోదైంది. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌. చలికాలంలో ఇంట్లో ఉన్నవారిలోనూ వైరస్​వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు రూపొందించారు ప్రెసిడెంట్. విదేశాల నుంచి తిరిగొచ్చే అమెరికన్లకు వీటి వల్ల ఇబ్బందులు తప్పకపోవచ్చనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. వచ్చే వారంలో ఈ కొత్త నిబంధనలు అమల‌లోకి రానున్నాయి. అమెరికా బయల్దేరడానికి ఒక్కరోజు ముందు చేయించుకున్న కొవిడ్‌ పరీక్షనే పరిగణనలోకి తీసుకోనున్నారు.

గతంలో ఇది 3 రోజుల వరకు చెల్లుబాటు అయ్యేది. ఇందులో నెగెటివ్‌ వచ్చినట్టు ప్రయాణికులు ఆధారాలను చూపించాలి. జాతి, వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండా అమెరికన్లు సహా ప్రయాణికులందరికీ ఇది వర్తిస్తుంది. విమానాలు, రైళ్లు, బస్సుల్లో ప్రయాణించేవారు తప్పనిసరిగా మాస్కులను ధరించాలి. జనవరితో ముగిసే ఈ నిబంధన గడువును పొడిగించనున్నారు. ప్రజారవాణా, పబ్లిక్‌ స్థలాల్లో మాస్కు ధరించని వారికి 37 వేల నుంచి 2.25 లక్షల వరకు జరిమానా విధిస్తారు. విదేశాల నుంచి అమెరికా చేరుకున్న అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలి. నెగెటివ్‌ వచ్చినా కొద్దిరోజులు క్వారంటైన్‌లోనే ఉండాలి. ప్రయాణికులు వారి కాంటాక్ట్​ ట్రేసింగ్​సమాచారాన్ని కూడా తప్పక సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో వ్యక్తుల పేర్లు, చిరునామా, ఫోన్​నెంబర్లు, మెయిల్ వంటి వివరాలు ఉండాలి. దక్షిణాఫ్రికా సహా ఏడు ఆఫ్రికా దేశాల ప్రయాణికులపై ఇప్పటికే నిషేధం విధించింది వైట్‌హౌజ్. అమెరికా పౌరులు, శాశ్వత నివాసితులకు ఇందులో మినహాయింపు ఉంటుంది. ఒమిక్రాన్‌పై శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయనం చేస్తున్నందున, కఠిన నిబంధనలు అదనపు రక్షణ కల్పిస్తాయంటున్నారు బైడెన్.

Also read:

Omicron Tension: ఒమిక్రాన్ భయం.. ఆటోమొబైల్..ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే..

Cryptocurrency: భారీ క్రిప్టోకరెన్సీ చోరీ.. సైబర్ దాడితో హ్యాకర్లు చేసిన పని.. ఎన్ని క్రిప్టో టోకెన్‌లను దొంగిలించారంటే..

Corona Tension: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన మంగోలియా ప్రతినిధి బృందంలో కరోనా కలకలం