Viral Video: విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య ఘర్షణ.. పంచ్‌లు, చెప్పదెబ్బలతో రెచ్చిపోయారు.. వీడియో వైరల్‌

|

Dec 29, 2022 | 9:24 AM

కానీ.. వారివురూ ఏ మాత్రం తగ్గటం లేదు. ఆ ఇద్దరు ప్రయాణీకుల మధ్య జరిగిన వాగ్వాదం కాస్త చినికి చినికి గాలివానగా మారింది.  కొట్టుకునే వరకు వెళ్లింది. పైగా వీరిలో ఒక ప్రయాణీకుడు తన కళ్లద్దాలను తీసివేసి మరొక ప్రయాణికుడిని కొట్టడం వీడియోలో కనిపిస్తుంది.

Viral Video: విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య ఘర్షణ.. పంచ్‌లు, చెప్పదెబ్బలతో రెచ్చిపోయారు.. వీడియో వైరల్‌
Thai Smile Airlines
Follow us on

గత కొంతకాలంగా విమానప్రయాణాల్లో గొడవలు, ఘర్షణలు తరచూ జరుగుతున్నాయి. విమాన సిబ్బంది, ప్రయాణికుల మధ్య వాగ్వాదం, కుమ్ములాటలకు సంబంధించిన వీడియో ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా వైరల్‌ అవుతున్నాయి. తాజాగా బ్యాంకాక్ నుంచి కోల్‌కతాకు వస్తున్న థాయ్ స్మైల్ విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య పెద్ద గొడవ జరిగింది. విమానం ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ఎగురుతుండగా, ఇద్దరు ప్రయాణికులు నువ్వా నేనా అనే రేంజ్‌లో పోట్లాడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఘటన డిసెంబర్ 27న చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావటంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

వైరల్‌ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగటం కనిపిస్తుంది..అదే సమయంలో ఓ ఎయిర్ హోస్టర్ వారికి నచ్చజెప్పి, పరిస్థితిని సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నించింది. కానీ.. వారివురూ ఏ మాత్రం తగ్గటం లేదు. ఆ ఇద్దరు ప్రయాణీకుల మధ్య జరిగిన వాగ్వాదం కాస్త చినికి చినికి గాలివానగా మారింది.  కొట్టుకునే వరకు వెళ్లింది. పైగా వీరిలో ఒక ప్రయాణీకుడు తన కళ్లద్దాలను తీసివేసి మరొక ప్రయాణికుడిని కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. అతని స్నేహితులు కూడా  గొడవలోకి దిగారు. ఎదుటి వ్యక్తి తలో చేయివేసి పిడిగుద్దుల వర్షం కురిపించారు. అవతలి వ్యక్తి వారిని తిరిగి కొట్టలేదు. అయితే, బాధిత ప్రయాణికుడు తనపై జరిగిన దాడిని తగ్గించుకోవడానికి మాత్రమే ప్రయత్నించాడు. విమాన సహాయకురాలు ఇద్దరినీ విడదీయడానికి తీవ్రంగానే శ్రమిస్తున్నారు. సహ-ప్రయాణికులు, విమాన సహాయకులు గొడవను ఆపాలని, శాంతించమని కోరడం వినవచ్చు.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న ఈ వీడియోపై జనాలు తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో.. కొంతమంది వినియోగదారులు క్యాబిన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కామెంట్స్ చేశారు. ఈ సంఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ..మేము ఈ సంఘటనను పరిశీలిస్తున్నామని, కస్టమర్ సౌలభ్యం ఎల్లప్పుడూ మా మొదటి ప్రాధాన్యత అని ఇప్పటికే పలు సందర్భాల్లో హామీ ఇచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.