Watch Video: గాల్లో ఎగురుతున్న విమానం తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

|

Jan 06, 2024 | 1:55 PM

అలాస్కా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737-9 MAX అనే విమానం పెను ప్రమాదం నుంచి బయట పడింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే దాని తలుపు గాలిలో తెరుచుకుంది. దీంతో ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణీకులు తీసిన వీడియోలలో మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ విమానం నుండి పూర్తిగా విడిపోయినట్లు కనిపిస్తోంది. ఎగ్జిట్ డోర్‌ గాల్లో ఎగిరిపోవడాన్ని ప్రయాణికులు వీడియో తీశారు. "AS1282 పోర్ట్‌ల్యాండ్ నుండి అంటారియో, కాలిఫోర్నియాకి శుక్రవారం సాయంత్రం బయలుదేరిన వెంటనే ఒక సంఘటన చోటు చేసుకుంది.

Watch Video: గాల్లో ఎగురుతున్న విమానం తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Alaska Airlines
Follow us on

అలాస్కా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737-9 MAX అనే విమానం పెను ప్రమాదం నుంచి బయట పడింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే దాని తలుపు గాలిలో తెరుచుకుంది. దీంతో ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణీకులు తీసిన వీడియోలలో మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ విమానం నుండి పూర్తిగా విడిపోయినట్లు కనిపిస్తోంది. ఎగ్జిట్ డోర్‌ గాల్లో ఎగిరిపోవడాన్ని ప్రయాణికులు వీడియో తీశారు. “AS1282 పోర్ట్‌ల్యాండ్ నుండి అంటారియో, కాలిఫోర్నియాకి శుక్రవారం సాయంత్రం బయలుదేరిన వెంటనే ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో విమానం 171 మంది ప్రయాణికులతో పాటు 6 మంది సిబ్బంది ఉన్నారు.

పోర్ట్‌ల్యాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు పైలట్‎లు. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు గల కారణాలను పరిశీలిస్తున్నట్లు అలాస్కా ఎయిర్ లైన్స్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. వివరాలు సేకరించిన వెంటనే వెల్లడిస్తామని చెప్పారు. అలాస్కా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1282కి సంబంధించిన పూర్తి పరిస్థితిని యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) పరిశీలిస్తున్నట్లు ట్విట్టర్లో తెలిపింది. ఈ ఘటన సంభవించినప్పుడు విమానం గరిష్ఠంగా 16,325 అడుగుల ఎత్తులో ఉన్నట్లు రియల్ టైమ్ ఎయిర్‌క్రాఫ్ట్ మూవ్‌మెంట్ మానిటర్ తన Flightradar24 అనే సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..