Nepal Plane Crash: నేపాల్‌లో ఘోర ప్రమాదం.. రన్‌వేపై కుప్పకూలిన విమానం..

|

Jan 15, 2023 | 12:20 PM

నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ల్యాండింగ్‌ సమయంలో రన్‌వేపై విమానం క్రాష్‌ అయ్యింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 72 మంది ప్రయాణికులతో

Nepal Plane Crash: నేపాల్‌లో ఘోర ప్రమాదం.. రన్‌వేపై కుప్పకూలిన విమానం..
Nepal Plane Crash
Follow us on

నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ల్యాండింగ్‌ సమయంలో రన్‌వేపై విమానం క్రాష్‌ అయ్యింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 72 మంది ప్రయాణికులతో వెళ్తున్న యెతీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్యాసింజర్ విమానం కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. పోఖ్రా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, పాత విమానాశ్రయం మధ్యలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిసింది. ఈ విషయాన్ని యెతీ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

దేశరాజధాని ఖాట్మాండు నుంచి పొకారా వెళ్తున్న విమానం ల్యాండింగ్‌ సమయంలో విమానం క్రాష్‌ అయ్యింది. ప్రమాదం జరిగిన -విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉండగా.. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం 30 మంది చనిపోయారు. 18 మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోకారా ఎయిర్‌పోర్టులో దిగుతుండగా విమానం కుప్పకూలింది. కొత్త ఎయిర్‌పోర్టు, పాత ఎయిర్‌ పోర్టు మధ్యలో నదిలో విమానం కుప్పకూలింది. ల్యాండింగ్‌ టైమ్‌లో విమానంలో మంటలు చెలరేగాయి.

ఇవి కూడా చదవండి

ఈ ఘటన కారణంగా పోఖ్రా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. ప్రస్తుతం ఇటు హిమాచల్ ప్రదేశ్ , కాశ్మీర్ మొదలు నేపాల్ వరకూ విపరీతమైన వాతావరణం ఉంది. దట్టమైన మంచు కురుస్తోంది. ఇది విమాన ప్రయాణాలకు ఒకింత ఇబ్బంది కలిగిస్తోంది. నేపాల్‌లో విమాన, హెలికాప్టర్ ప్రయాణాలకు అక్కడి వాతావరణం ఎప్పుడూ సమస్యలు సృష్టిస్తూనే ఉంటుంది. అందువల్ల ఈ విమాన ప్రమాదానికి కారణమై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో చూడొచ్చు..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..