Milk Cost high: పాక్‌లో పాల ధర భారీగా పెంపు.. లీటరు పాల ధర ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కంటే కరాచీలోనే ఎక్కువ

|

Jul 05, 2024 | 8:46 AM

అంతంత మాత్రంగా ఉన్న వేతనాన్ని ఖర్చు చేసే సామర్థ్యం మరింత క్షీణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాయాది దేశంలో సుమారు 40 శాతం మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని, ముఖ్యంగా చిన్నారుల్లో పౌష్టికాహార లోపానికి ఇప్పుడున్న పరిస్థితులు కారణంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో ఇప్పుడు పాల ధర పెంపు చిన్నారుల పరిస్తితి పై తీవ్ర ప్రభావం చూపించనుంది.

Milk Cost high: పాక్‌లో పాల ధర భారీగా పెంపు.. లీటరు పాల ధర ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కంటే కరాచీలోనే ఎక్కువ
Milk Cost High In Pakistan
Follow us on

మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా ఉంది దాయాది దేశంలోకి పాక్ పౌరుల పరిస్థితి. ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా రోజు రోజుకీ పెరిగిపోతుండడంతో ఏమి కొనేటట్లు లేదు.. ఏమి తినేటట్లు లేదు అంటూ లబోదిబోమంటున్న పాక్ పౌరులకు ఆ దేశ ప్రభుత్వం మరో షాకిచ్చింది. నిత్యావసర వస్తువుల్లో ప్రధానమైన పాలపై పన్నుని విధించింది. దీంతో సడెన్ గా పాల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం పాకిస్తాన్ లో పాల ధరలు ఎంతగా మండిస్తున్నాయంటే.. ప్రపంచంలో అబివృద్ధి చెందినా దేశాలుగా పేరు గాంచిన ఫ్రాన్స్, ఆస్ట్రేలియా దేశాలకంటే ఎక్కువ ధరలు పాక్ లోనే ఉన్నాయి.

కొన్ని రోజుల క్రితం వరకూ పొరుగు దేశం పాకిస్తాన్ లో పాలకు ఎటువంటి పన్ను ఉండేది కాదు.. అయితే గత వారం పాక్ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ప్యాకేజ్డ్‌ పాలపై 18 శాతం పన్ను విధిస్తున్నట్లు ప్రకరిమ్చింది. దీంతో ఆ దేశంలో పాల ధరలకు రెక్కలు వచ్చి అమాంతం 25 శాతానికి పైగా పెరిగాయి. అంటే ఈ కొత్త పన్నుతో కలిపి పాక్ లోని ప్రధాన నగరం కరాచీలో  అల్ట్రా హై టెంపరేచర్‌ పాల ధర రూ. 370 లకు (ఆ దేశ కరెన్సీలో) చేరుకుంది. అంటే ఈ పాల ధరను డాలర్ల లెక్కలో చూస్తే లీటర్‌ పాల ధర 1.33$గా ఉంది. అదే సమయంలో ప్రాన్స్ రాజధాని పారిస్‌లో లీటర్‌ పాల ధర 1.23 డాలర్లు ఉండగా ఆస్ట్రేలియా ప్రధాన నగరం మెల్‌బోర్న్‌లో పాల ధర 1.08 డాలర్లు మాత్రమే.

పాల ధరలు పెరగడంపై ఆ దేశ ఆర్ధిక నిపుణులు స్పందిస్తూ… దీని వలన ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని అంటున్నారు. అంతేకాదు ప్రజల వేతనాలు అతి తక్కువగా ఉన్నాయని.. ఈ నేపధ్యంలో ఇప్పుడు పాల పెంపు వారి ఖర్చు చేసే సామర్ధ్యంపై పడుతుందని.. నిత్యావసర వస్తువులనే కాదు… ఇక నుంచి పాలను కొనాలన్నా ఆలోచించే పరిస్తితి నెలకొన్నదని.. అంతంత మాత్రంగా ఉన్న వేతనాన్ని ఖర్చు చేసే సామర్థ్యం మరింత క్షీణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాయాది దేశంలో సుమారు 40 శాతం మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని, ముఖ్యంగా చిన్నారుల్లో పౌష్టికాహార లోపానికి ఇప్పుడున్న పరిస్థితులు కారణంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో ఇప్పుడు పాల ధర పెంపు చిన్నారుల పరిస్తితి పై తీవ్ర ప్రభావం చూపించనుంది. బెయిలవుట్‌ ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) విధించిన షరత్తుల్లో భాగంగా ఆ దేశ ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో ఏకంగా 40 శాతం మేర పన్నులు పెంచిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..