After Taliban Takeover: మీకు మీరే.. మాకు మేమే.. తాలిబన్ మార్క్ క్లాస్ రూమ్స్.. బాయ్స్ అండ్ గాళ్స్ మధ్య పరదా

|

Sep 06, 2021 | 2:01 PM

తాలిబన్ల ఆఫ్ఘన్ ఆక్రమణ పూర్తయ్యింది. ఇకపై మనం వింత వింత దృశ్యాలను చూడబోతున్నామనడానికిదో అక్కడి జరుగుతున్న పరిస్తుతులే పెద్ద ఉదాహరణ.

After Taliban Takeover: మీకు మీరే.. మాకు మేమే.. తాలిబన్ మార్క్ క్లాస్ రూమ్స్.. బాయ్స్ అండ్ గాళ్స్ మధ్య పరదా
After Taliban Takeover
Follow us on

తాలిబన్ల ఆఫ్ఘన్ ఆక్రమణ పూర్తయ్యింది. ఇకపై మనం వింత వింత దృశ్యాలను చూడబోతున్నామనడానికిదో అక్కడి జరుగుతున్న పరిస్తుతులే పెద్ద ఉదాహరణ. తాలిబన్ చట్టాలు క్లాసు రూముల్లోకి దూరి ఎలా పరదాలు కట్టాయో మీరే చూడండి.. ఇది తాలిబన్ మార్క్ పాలనకో మచ్చు తునక. ఇక్కడ చచ్చిన వాళ్లు చనిపోగా.. మిగిలిన వాళ్లకు ఎంత మాత్రం మనశ్శాంతి ఉండే అవకాశమే కనిపించడం లేదు. ఈ పరదా మరెక్కడో కాదు.. తాలిబన్లు నడిపే కాలేజీల్లో. ఇక్కడ ఆడపిల్లలు మగపిల్లలు ఒకరినొకరు చూసుకోడానికి వీల్లేదు. పలకరించుకోడానికి వీళ్లేదు.. ఒకే గదిలో ఉంటున్నా.. మీకు మీరే మాకు మేమే.. అనేలాంటి ఏర్పాటు ఎలా ఉందో గమనించారా? దటీజ్ తాలిబన్ మార్క్ అడ్మినిస్టేషన్.

ఇప్పుడు తాజాగా ఆఫ్ఘనిస్థాన్ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో ఎక్కడా ఆడపిల్లలకు మగ టీచర్లు చదువు చెప్పకూడదని  తాలిబన్లు రూల్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆఫ్ఘన్ ఉన్నత విద్యాశాఖ మంత్రి షేక్ అబ్దుల్ బాకీ హక్కానీ ఒక ప్రకటన చేశారు. కో-ఎడ్యుకేషన్ విధానాన్ని కూడా దేశవ్యాప్తంగా రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. షరియా చట్టం ప్రకారమే విద్యాసంస్థలు తమ కార్యకలాపాలు సాగించాలని స్పష్టం చేశారు.

ఉన్నత విద్యాశాఖ మంత్రిగా నియామకం జరిగిన మరుసటి రోజే హక్కానీ ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘన్‌లో విద్యా వ్యవస్థను మెరుగు పరిచేందుకు తాము ప్రయత్నిస్తున్నామని హక్కానీ అన్నారు. ఇప్పటి వరకూ నడిచిన విద్యా వ్యవస్థ షరియా చట్టాలకు విరుద్ధంగా నడిచిందని విమర్శించారు. అయితే తాలిబన్ల ఈ నిర్ణయాల పట్ల టీచర్లు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే బాలికలకు విద్య మరింత దూరమవుతుందని అంటున్నారు.

 

ఇవి కూడా చదవండి: డుగ్గు డుగ్గు డ్యాన్స్‌తో అదరగొట్టిన టీఆర్‌ఆస్‌ ఎమ్మెల్యే.. ‘బుల్లెట్‌ బండి’ రాజయ్య స్టెప్పులు

YCP Leader Warning: పనులు ఆపేస్తారా.. దాడులు చేయమంటారా..కాంట్రాక్టర్‌కు అధికార పార్టీ నాయకుడి వార్నింగ్‌

Mysterious Fever: చిన్నారులను వెంటాడుతున్న మరో అంతుచిక్కని జ్వరం.. 48 గంటల్లో 50 మంది మృతి..