
ఆఫ్ఘనిస్తాన్‌ను భారీ భూకంపం వణికించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఆదివారం రాత్రి పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. యుఎస్‌జిఎస్ ప్రకారం భూకంప కేంద్రం నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ సమీపంలో ఉందని.. దాని లోతు 8 కిలోమీటర్లు ఉందని తెలిపింది. భూకంపం చాలా తీవ్రంగా ఉండటంతో మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. తూర్పు ప్రావిన్స్ నంగర్‌హార్‌లో ఇప్పటివరకు 622 మంది మరణించారు. 1500 మందికి పైగా గాయపడ్డారు. అనేక ప్రాంతాలలో భారీ నష్టం కూడా సంభవించింది.
భూకంపం ఎంత బలంగా ఉందంటే దాని ప్రకంపనలు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ముఖ్యంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కూడా కనిపించాయి. దీనితో పాటు, పాకిస్తాన్‌లో కూడా భూకంపం ప్రకంపనలు సంభవించాయి. దాదాపు 20 నిమిషాల తర్వాత.. అదే ప్రావిన్స్‌లో రెండవ సారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత 4.5 .. లోతు 10 కిలోమీటర్లు. ఇది ఆదివారం స్థానిక సమయం రాత్రి 11:47 గంటలకు సంభవించింది.
Notable quake, preliminary info: M 6.0 – 27 km ENE of Jalālābād, Afghanistan https://t.co/hE9lf5oIhx
— USGS Earthquakes (@USGS_Quakes) August 31, 2025
ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో భూకంపం
అక్టోబర్ 7, 2023న, ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. తరువాత బలమైన ప్రకంపనలు సంభవించాయి. తాలిబాన్ ప్రభుత్వం కనీసం 4,000 మంది మరణించారని అంచనా వేస్తోంది. అయితే ఐక్యరాజ్యసమితి 1,500 మంది మరణించి ఉంటారని పేర్కొంది. ఈ విపత్తుపై యూఎన్ విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. ప్రజలందరూ గాఢనిద్రలో ఉండగా భూకంపం రావడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. భూ ప్రకంపనల ధాటికి భవనాలు కంపించటంతో జనం భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టారు. ఇటీవలి కాలంలో ఆఫ్ఘనిస్తాన్‌ను తాకిన అత్యంత ప్రాణాంతకమైన ప్రకృతి వైపరీత్యం ఇది.
నెలలో 5వ సారి భూకంపం
గత నెలలో (ఆగష్టు) ఆఫ్ఘనిస్తాన్‌లో ఇది ఐదవ భూకంపం. ఈ దేశం భూకంపాల పరంగా చాలా సున్నితమైన ప్రాంతం. అందువల్ల ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. అంతకుముందు, ఆగస్టు 27న 5.4 తీవ్రతతో, ఆగస్టు 17న 4.9 తీవ్రతతో, ఆగస్టు 13న 10 కి.మీ లోతులో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు, ఆగస్టు 8న, 10 కి.మీ లోతులో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.
భూకంప తీవ్రతను ఎలా కొలుస్తారంటే
భూకంపాలను రిక్టర్ స్కేల్ ఉపయోగించి కొలుస్తారు. దీనిని రిక్టర్ మాగ్నిట్యూడ్ టెస్ట్ స్కేల్ అంటారు. రిక్టర్ స్కేల్‌లో, భూకంపాలను 1 నుంచి 9 ఆధారంగా కొలుస్తారు. దీనిని దాని కేంద్రం నుంచి అంటే భూకంప కేంద్రం నుంచి కొలుస్తారు. భూకంపం సమయంలో భూమి లోపల నుంచి విడుదలయ్యే శక్తి తీవ్రతను దీని ద్వారా కొలుస్తారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..