Afghan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో నిండుకుంటున్న ఆహార నిల్వలు.. పోషకాహార లోపంతో 10లక్షల చిన్నారుల ప్రాణాలకు ముప్పు..

|

Oct 12, 2021 | 5:17 PM

Afghanistan Crisis: ప్రజాస్వామ్య పాలన నుంచి ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత.. అక్కడ ప్రజల జీవితం దుర్భరంగా మారిందని వార్తలు తరచుగా..

Afghan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో నిండుకుంటున్న ఆహార నిల్వలు.. పోషకాహార లోపంతో 10లక్షల చిన్నారుల ప్రాణాలకు ముప్పు..
Afghan Crisis
Follow us on

Afghanistan Crisis: ప్రజాస్వామ్య పాలన నుంచి ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత.. అక్కడ ప్రజల జీవితం దుర్భరంగా మారిందని వార్తలు తరచుగా వింటున్నారు. తాలిబన్లు చెప్పింది చెబుతుంది ఒకటి.. దేశంలో వారు చేస్తున్న పనులు వేరెకటి.. అయితే తాజాగా ఆఫ్గనిస్తాన్ లోని సుమారు 10లక్షల మంది చిన్నారుల ప్రాణాలు అరచేతుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో ఈ ఏడాది సుమారు 10 లక్షల మంది చిన్నారులు పోషకాహార లోపంతో ఇబ్బందులను ఎదుర్కోనున్నట్లు యునిసెఫ్‌ వెల్లడించింది. అఫ్గాన్‌లో నెలకొన్న సంక్షోభం రానున్న రోజుల్లో భారీ విపత్తుగా మారనున్నదని.. నివారణ కోసం.. అంతర్జాతీయంగా అన్ని దేశాలు ముందుకు రావాలని.. పిల్లల కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. లేదంటే ఆఫ్గనిస్తాన్ లో భవిష్యత్ తరాలను కోల్పోనున్నదని పిల్లల ప్రాణాలకు ముప్పు తప్పదని యునిసెఫ్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఒమర్‌ అబ్దీ హెచ్చరించారు.  ఇప్పటికే ఆయన దేశ వ్యాప్తంగా పర్యటించి కాబుల్‌లోని ఇందిరా గాంధీ చిన్నారుల ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

దీంతో దేశంలో చాలా మంది తీవ్ర పోషకాహార లోపం సహా మిజిల్స్‌,  నీటి విరేచనాలు వంటి వ్యాధులతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని ఒమర్‌ అబ్దీ చెప్పారు. అంతేకాదు తాలిబన్ నేతలతో భేటీ అయినా ఒమర్ చిన్నారులకు పోషకాహారం, మంచినీరు అందించాలని కోరారు.  చిన్నారులను రక్షించుకోవడానికి పరిశుభ్రతపై తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.  ఇప్పటికే దేశంలో 30శాతానికిపైగా ప్రజలు రోజూ ఒక పూట కూడా భోజనం చేసే పరిస్థితి కూడా లేదని..  రోజు రోజుకీ ఆ దేశంలో ఆహార నిల్వలుకూడా తగ్గిపోతున్నాయని.. ఇక కొన్ని రోజుల్లోనే పూర్తిగా నిండుకునే ప్రమాదం ఉందని యునిసెఫ్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఒమర్‌ అబ్దీ హెచ్చరించారు. ప్రపంచ దేశాలు ఆఫ్గనిస్తాన్ లోని చిన్నారులను కాపాడానికి ముందుకు రావాలని కోరారు.

Also Read: రైతుకి లక్షలార్జించిన భారీ గుమ్మడి కాయ..ప్రపంచంలో రెండో పెద్ద గుమ్మడికాయగా రికార్డ్..