హైటెక్ బిచ్చగత్తే..! లగ్జరీ కారులో వచ్చి బిచ్చమెత్తుకుంటున్న మహిళ.. పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టు

|

Jan 27, 2023 | 7:11 PM

నిత్యం లగ్జరీ కారులో వచ్చి బిచ్చమెత్తుకుంటున్న ఓ మహిళలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రతి రోజూ మసీదుల ముందు భిక్షాటన చేస్తోన్న ఓ మహిళా యాచకురాలు సాయంత్రం పనిముగించుకుని లగ్జరీ కారులో ఇంటికి తిరిగి..

హైటెక్ బిచ్చగత్తే..! లగ్జరీ కారులో వచ్చి బిచ్చమెత్తుకుంటున్న మహిళ.. పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టు
Begging Women
Follow us on

నిత్యం లగ్జరీ కారులో వచ్చి బిచ్చమెత్తుకుంటున్న ఓ మహిళలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రతి రోజూ మసీదుల ముందు భిక్షాటన చేస్తోన్న ఓ మహిళా యాచకురాలు సాయంత్రం పనిముగించుకుని లగ్జరీ కారులో ఇంటికి తిరిగివెళ్లేది. ఈ తథంగాన్నంతా గమనించిన పోలీసులు సదరు మహిళను అరెస్ట్‌ చేసి కారుతో పాటు భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకెళ్తే..

మన దేశంలోనేతే ఎవరైనా భిక్షాటన యదేచ్చగా చేస్తారుగానీ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో భిక్షాటన నేరం కింద పరిగణిస్తారు. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో భిక్షాటన నేరం కింద పరిగణిస్తారు. ఐతే అబుదాబికి చెందిన ఓ మహిళ నిత్యం మసీదుల వద్ద భిక్షాటన చేయడాన్ని ఓ వ్యక్తి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు నిఘా పెట్టగా దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆ మహిళ రోజంతా నగరంలోని వివిధ మసీదుల్లో భిక్షాటన చేస్తుండేది. భిక్షాటన తర్వాత ఆమె చాలా దూరం నడిచివెళ్లి ఓ చోట ఆగివున్న ఖరీదైన లగ్జరీ కారులో ఇంటికి వెళ్తోందని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు ఆమెను వెంబడించి అదుపులోకి తీసకున్నారు. ఆమె వద్ద ఉన్న లభించిన భారీ మొత్తంలోని నగదుతోపాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. గతేడాది నవంబర్ 6 నుంచి డిసెంబర్ 12 వరకు యూఏఈలో దాదాపు159 మంది యాచకులను అబుదాబి పోలీసులు అరెస్ట్ చేశారు. భిక్షాటన అనేది ఓ సామాజిక రుగ్మత, అనాగరిక చర్య అని, అది ఏ దేశ ప్రతిష్టనైనా దిగజారుస్తుందని అరబ్ పోలీసులు మీడియాకు తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా, భిక్షాటన వంటి చెడు ప్రవర్తనను అరికట్టడానికి యూఏఈలో సోదాలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు యూఏఈలో ఆన్‌లైన్‌లో యాచించడం కూడా చట్టవిరుద్ధమే. సోషల్ మీడియాలు, ఈమెయిల్ లేదా మరేదైనా ప్లాట్‌ఫాం ద్వారా యాచించినట్లు గుర్తిస్తే కఠినంగా శిక్షిస్తారు.

భిక్షాటన చేసే వారికి యూఏఈలో ఎటువంటి శిక్షలుంటాయంటే..

యూఏఈలో భిక్షాటన చేస్తే కఠిన శిక్షలు విధిస్తారు కూడా. భిక్షాటన చేసిన వ్యక్తికి మూడు నెలల జైలు శిక్షతోపాటు 5 వేల అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ (భారత కరెన్సీలో సుమారు రూ.లక్షా 11 వేలు) లేదా రెండింటిలో ఏదో ఒకటి విధించవచ్చు. బిక్షాటనకు గ్యాంగ్‌లను ఏర్పాటు చేస్తే అటువంటి వారికి ఆరు నెలల జైలు శిక్షతోపాటు లక్ష దిర్హామ్ (భారత కరెన్సీలో రూ.22 లక్షల 17 వేలు) జరిమానాగా ఆ దేశ ప్రభుత్వం విధిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.