AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సీన్ మళ్లీ రిపీట్.. అమ్మా..అమ్మా అంటున్నా వినిపించుకోలేదు.. మూడురోజులపాటు..

అగ్రరాజ్యం అమెరికాలో రెండేళ్ల క్రితం జరిగిన సీన్‌ మళ్లీ రిపీట్‌ అయింది. పోలీసుల దాడిలో చనిపోయిన నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ లాంటి ఘటనే తాజాగా మరోటి జరిగింది. పోలీసులు విచక్షణా రహితంగా జరిపిన..

ఆ సీన్ మళ్లీ రిపీట్.. అమ్మా..అమ్మా అంటున్నా వినిపించుకోలేదు.. మూడురోజులపాటు..
Police Attack In America
Ganesh Mudavath
|

Updated on: Jan 28, 2023 | 3:42 PM

Share

అగ్రరాజ్యం అమెరికాలో రెండేళ్ల క్రితం జరిగిన సీన్‌ మళ్లీ రిపీట్‌ అయింది. పోలీసుల దాడిలో చనిపోయిన నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ లాంటి ఘటనే తాజాగా మరోటి జరిగింది. పోలీసులు విచక్షణా రహితంగా జరిపిన దాడిలో 29 ఏళ్ల నల్ల జాతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. జనవరి 7న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్‌ ఇప్పుడు బయటకు వచ్చాయి. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం మెంఫిస్ సిటీలో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేశాడనే కారణంతో ఓ యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఆపై అతడిని దారుణంగా కొట్టారు. అతడు నేనేతప్పూ చేయలేదు.. నేను మా ఇంటికి వెళ్తున్నాను అని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. టైర్‌ నికోలస్‌ అనే ఆ నల్ల జాతీయుడుపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఒకరు ముఖంపై పిడి గుద్దులు గుద్దారు. మరొకరు కాలితో ఇష్టంవచ్చినట్టు తన్నారు.

ముందు మామూలుగానే అతన్ని అరెస్టు చేసినట్లు కనిపించినా తర్వాత అతడిని తీవ్రంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక బాధితుడు ‘అమ్మా’ అంటూ అరుస్తున్నా, ఏడుస్తున్నా పోలీసులు కనికరించలేదు. మూడు రోజులపాటు చావుబతుకుల మధ్య పోరాడిన నికోలస్ జనవరి 10న చనిపోయాడు. అయితే నికోలస్ ను పోలీసులు కొట్టిన ఘటనకు సంబంధించి సీసీటీవీ, పోలీసుల బాడీ కెమెరాల వీడియోలు తాజాగా బయటకి వచ్చాయి. వీటిని మింఫిస్ పోలీస్ శాఖ రిలీజ్ చేసింది. యువకుడు ఎంత ఏడ్చినా పట్టించుకోలేదు. రోడ్డుపై పడేసి తీవ్రంగా కొట్టారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దాంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. పోలీసుల అనుచిత ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నికోలస్ పై పోలీసులు దాడి చేసిన వీడియోలు తాను చూశానని, అవి తనను చాలా బాధించాయని చెప్పారు. బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. మరోవైపు నికోలస్ ను విచక్షణా రహితంగా కొట్టిన ఆఫీసర్లు కూడా నల్లజాతీయులే కావడం విశేషం. దాడికి పాల్పడిన ఐదుగురు ఆఫీసర్లను అరెస్ట్ చేయగా నలుగురు బెయిల్ పై విడుదలయ్యారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..