Malayalis in Talibans: తాలిబన్లలో మలయాళీయులు ఉన్నారా..? కాంగ్రెస్ నేత శశిథరూర్ ట్వీట్ పై రేగిన వివాదం..

| Edited By: Anil kumar poka

Aug 17, 2021 | 6:04 PM

తాలిబన్లలో మలయాళీలు ఉన్నారంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ ట్వీట్ చేస్తూ ఇందుకు సంబంధించి షేర్ చేసిన ఓ వీడియో క్లిప్ వివాదాస్పదమైంది. కాబూల్ శివార్లలో ప్రవేశించిన ఇద్దరు తాలిబాన్లల్లో ఒకడు కింద కూర్చుండిపోయి ఆనంద బశుపాలు

Malayalis in Talibans: తాలిబన్లలో మలయాళీయులు ఉన్నారా..?  కాంగ్రెస్ నేత శశిథరూర్ ట్వీట్ పై రేగిన వివాదం..
Talibans
Follow us on

తాలిబన్లలో మలయాళీయులు ఉన్నారంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ ట్వీట్ చేస్తూ ఇందుకు సంబంధించి షేర్ చేసిన ఓ వీడియో క్లిప్ వివాదాస్పదమైంది. కాబూల్ శివార్లలో ప్రవేశించిన ఇద్దరు తాలిబాన్లల్లో ఒకడు కింద కూర్చుండిపోయి ఆనంద బశుపాలు రాలుస్తున్న ఓ వీడియోను మొదట ఓ యూజర్ రిలీజ్ చేయగా.. దీనికి శశిథరూర్ వీరు బహుశా మలయాళీయులు తాలిబన్లు అయి ఉండవచ్చునని పేర్కొన్నారు. ఇందుకు ఆయన ఈ ఇద్దరు తాలిబన్లలో ఒకడు ‘సంసరికెట్టే’ అని వ్యాఖ్యానించాడని ఆయన విశ్లేషించారు. ఇది మలయాళీ పదం అన్న రీతిలో ఆయన స్పందించారు. అయితే కేరళను ఉగ్రవాదులతో ముడిపెట్టరాదని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. శశిథరూర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇక ఇది కామెడీ షో కాదని ఢిల్లీ బీజేపీ ఐటీ విభాగం పేర్కొంటూ కేరళలో తాలిబన్ తరహా ఉగ్రవాదులెవరూ లేరని తెలిపింది.

ఈ విషయం మీరు తెలుసుకోవాలని ఘాటుగా సలహా ఇచ్చింది. ఆ రాష్ట్రంలో స్యుడో సెక్యులరిజాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు వ్యాపింపజేస్తున్నాయని వినీత్ గోయెంకా ఆరోపించారు. తాను రాస్తున్న పుస్తకంలో కూడా ఇదే విషయాన్నీ ప్రస్తావించానన్నారు. అయినా తాలిబాన్లకు, మలయాళీయులకు లింక్ ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. ప్రతి దానిని రాజకీయం చేయడం కాంగ్రెస్ నేతలకు అలవాటైపోయింది ఆయన ఆరోపించారు.

మరిన్ని ఇక్కడ చూడండి : ఈ చిన్నారి ఇప్పుడు ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన హీరోయిన్.. ఎవరో గెస్ చెయ్యగలరా ..?:Celebrity Baby Picture Video.

 గుండు చేయించుకొని మరి రజినీకాంత్ ని పెళ్ళికి ఒప్పించింది… తలైవా పెళ్లికి ట్వీస్ట్‌లు మీద ట్వీస్ట్‌లు:Rajinikanth Love story video.

 బైక్ నడుపుతూ.. ఇదేం ఓవర్ యాక్షన్ రా బాబు !అందుకే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అంటారు..:Bike Viral Video.

 జియో సంచలనం.. రూ. 4 వేలకే స్మార్ట్‌ ఫోన్‌..!ఫీచర్స్ ఇలా .. :JIO Phone for 4k video.