మనిషి జీవితంలో ఎప్పుడు ఏం అవుతాడో ఎవరు చెప్పలేరు. ఇది అక్షరాల నిజం ఎందుకంటే.. అప్పటి వరకు పేదవాడిగా ఉన్న వ్యక్తి రాత్రికి రాత్రే ధనవంతుడు కావొచ్చు.. అప్పటి వరకు ధనవంతుడిగా ఉన్న వ్యక్తి పేదవాడు కావొచ్చు.. ఇలా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. ధనికుడిగా మారితే అదృష్టం అంటారు.. పేదవాడిగా మారితే దురదృష్టం అంటారు. చివరికి ఏదైనా అదృష్టంపైనే ఆధారపడుతుందని చెబుతారు.
ఇలానే ఓ వ్యక్తి కోటీశ్వరుడు అయ్యాడు. రాత్రికి రాత్రే రూ.1.5 కోట్లు సంపాదించాడు. కష్టపడి కాదు అదృష్టం వరించి కోటీశ్వరుడయ్యాడు. అమెరికా నార్త్ కరోలినాలోని ఓ మెకానిక్‌ను అదృష్టం వరించింది. లాటరీలో దాదాపు 2 లక్షల డాలర్లను(దాదాపు రూ.1.5 కోట్లు) అతడు గెలుచుకున్నాడు. ఇప్పుడు ఆ డబ్బులతో తన కుటుంబ కలలను తీర్చాలని అతడు ఆశపడుతున్నాడు.
సెప్టెంబరు 29న ఫ్రాంక్‌విల్లే ప్రాంతానికి చెందిన గ్రెగరీ వారెన్.. ఓ చోట గ్యాస్ ఫిల్లింగ్ చేయడానికి వెళ్లాడు. అక్కడ ‘క్యాష్ 5 లాటరీ’ అమ్ముతున్నారు. అమ్మే వ్యక్తి టికెట్ కొనండి సార్ అని అడిగాడు. దీంతో వారెన్ టికెట్టును కొనుగోలు చేశాడు. కానీ, అక్టోబరు 4వరకు అతడు ఆ టికెట్ సంగతే పట్టించుకోనే లేదు. అనూహ్యంగా అతడు కొనుగోలు చేసిన టికెట్టే లాటరీలో జాక్‌పాట్ గెలుచుకుంది. పన్నుల తర్వాత.. దాదాపు రూ. కోటి చెక్కును అందుకున్నాడు వారెన్.
Read Also… Indo China Talks: చైనా మొండి వైఖరితో అసంపూర్తిగా ముగిసిన భారత్-చైనా సైనిక కమాండర్ స్థాయి చర్చలు..