Covid New Drug: కొవిడ్ రోగుల్లో ఆశలు రేకెత్తిస్తున్న కొత్త డ్రగ్.. యాంటిబాడీ థెరపీతో మంచి ఫలితాలు

|

Jun 16, 2021 | 3:43 PM

ANTIBODY THERAPY: కోవిడ్ -19 బారినపడి మృత్యువుతో పోరాడుతున్న రోగులకు న్యూ డ్రగ్(Regen-Cov) కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. న్యూయార్క్‌లోని రెజెనెరాన్ అనే సంస్థకు చెందిన యాంటిబాడీ థెరపీ మంచి ఫలితాన్ని ఇస్తోంది.

Covid New Drug: కొవిడ్ రోగుల్లో ఆశలు రేకెత్తిస్తున్న కొత్త డ్రగ్.. యాంటిబాడీ థెరపీతో మంచి ఫలితాలు
Covid Patient
Follow us on

కోవిడ్ -19 బారినపడి మృత్యువుతో పోరాడుతున్న రోగులకు న్యూ డ్రగ్(Regen-Cov) కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. న్యూయార్క్‌లోని రెజెనెరాన్ అనే సంస్థకు చెందిన యాంటిబాడీ థెరపీ(ANTIBODY THERAPY) మంచి ఫలితాన్ని ఇస్తోంది. రెగెన్ -కోవ్ అనే ఈ యాంటిబాడీ థెరపీ అందిస్తున్న ఫలితాలను  ప్రపంచ ఆరోగ్య సంస్థ సెంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ స్వాగతించారు. న్యూయార్క్‌లోని రెజెనెరాన్ సంస్థ కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువున్న రోగులకు ఈ యాంటిబాడీ థెరపీని నిర్వహిస్తోంది. కరోనా వైరస్ బారినపడి శరీరంలో సొంతంగా యాంటిబాడీలు ఉత్పత్తి చేసుకోలేని వారిలో ఈ యాంటీబాడీస్ థెరపీ మంచి ఫలితాలన్ని ఇస్తోంది. కరోనా వైరస్ ఉన్న వారిలో  రెగెన్-కోవ్ డ్రగ్ యాంటిబాడీస్ ఇస్తోంది. చాలా మంది ప్రాణాలు ఈ యాంటీబాడీస్ కాపాడినట్లు బ్రిటిష్ ఆసుపత్రులలో జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. 9,785 మంది ఆసుపత్రి రోగుల కేసు స్టడీస్ పరిశీలించారు. డెక్సామెథాసోన్ స్టెరాయిడ్, టోసిలిజుమాబ్ (యాంటీ ఇన్ఫ్లమేటరీ) ఇచ్చిన వారి కంటే 20% ఎక్కువ మంది రోగులు ఈ మందుతో బయట పడ్డారని ఆ అధ్యయన నివేదిక వెల్లడించింది.

రెగెన్-కోవ్ వల్ల 17 రోజులు ఆసుపత్రిలో ఉండే వాళ్లు 13 రోజులకే డిశార్చ్ అయ్యారు. రెగెన్-కోవ్ రెండు మోనోక్లోనల్ యాంటీబాడీస్ కలయికతో సదరు యాంటిబాడీ థెరపీ నిర్వహిస్తున్నారు. వైరస్ వ్యాప్తి జరగకుండా యాంటీబాడీస్ అడ్డుకుంటున్నాయి. కరోనా వైరస్ “స్పైక్” ప్రోటీన్‌లు శరీరంలో వ్యాపించకుండా అడ్డుకుంటున్నాయి. వైరస్ కణాలకు సోకకుండా నిరోధిస్తున్నాయి. రెండు యాంటీబాడీస్ చికిత్సతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలుగుతున్నారు. కొవిడ్ మరణాలను తగ్గించే మందు ఇంత వరకు రాలేదు. ఇప్పుడీ యాండీబాడీస్ థెరపీ చికిత్స పెద్ద విజయమేనని సెంటిస్టులు చెబుతున్నారు. ఆసుపత్రిలో చేరిన రోగుల మరణాలను రెగిన్-కోవ్ తగ్గిస్తున్నాయి.

Covid-19

2020లో బ్రిటిష్ శాస్త్రవేత్తలు డెక్సామెథాసోన్ డ్రగ్‌ను కనుగొన్నారు. ఇప్పుడు మరో మోనో క్లోనల్ యాంటీ బాడీస్ అందుబాటులోకి వచ్చింది. అమెరికా, బ్రెజిల్, కెనడా, యూరోపియన్ యూనియన్, భారత్ లో ఉపయోగించేందుకు రెగెన్-కోవ్ కు అనుమతులు దక్కాయి. బ్రిటన్ లో పరిశోధనాత్మక డ్రగ్ గానే రెగిన్-కోవ్ ఉంది. రెగిన్-కోవ్ యాంటీబాడీస్ రాకను ప్రపంచ ఆరోగ్య సంస్థ సెంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ స్వాగతించారు‌. కొవిడ్పై పోరాటంలో  మోనోక్లోనల్-యాంటీబాడీ డ్రగ్ పాత్ర పరిమితమని వ్యాఖ్యానించారు.

ప్రపంచంలో  ఏయే దేశాల్లో మోనోక్లోనల్ యాంటీబాడీ డ్రగ్ అందుబాటులో ఉందన్న అంశంపై వెల్కమ్ ట్రస్ట్, బ్రిటిష్ మెడికల్ ఛారిటీ, ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్ IAVI  అధ్యయనం నిర్వహించాయి. ఈ మందులు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేవని అధ్యయనంలో తేలింది. ఈ మందులు మూడొంతుల కంటే ఎక్కువ అమెరికా, కెనడా, ఐరోపాలో ఉన్నాయి. రెగెన్-కోవ్ మందులను అమెరికా, జర్మనీ కొనుగోలు చేశాయి. 2.6 బిలియన్లకు 1.25 మిలియన్ మోతాదు కొనుగోలు చేసిందుకు అమెరికా అంగీకారం తెలిపింది. జర్మనీ 20,0000 మోతాదులకు 7 487 మిలియన్లు ఖర్చుచేసింది. డొనాల్డ్ ట్రంప్ కోవిడ్ -19 తో అనారోగ్యానికి గురైనప్పుడు రెగెన్-కోవ్‌తో చికిత్స జరిపినట్లు తెలుస్తోంది.

మోనోక్లోనల్-యాంటీబాడీ చికిత్స ఖరీదైనదనే వాదన కూడా ఉంది. ప్రస్తుతానికి సంపన్న దేశాలకు మాత్రమే ఇది అందుబాటులో ఉండనుంది. భారత్‌‌లో అందుబాటులోకి వచ్చినా.. ధనవంతులకు మాత్రమే ఈ మందు అందుబాటులో  ఉండే అవకాశముంది.

ఇవి కూడా చదవండి..కరోనా క్రిమినల్స్.. ‘కోవిషీల్డ్’ పేరిట నకిలీ వ్యాక్సిన్ పంపిణీ.. లబోదిబోమంటున్న బాధితులు

కరోనా మూడో వేవ్ ముప్పు సమయంలో పిల్లలను రక్షించుకోవడం ఎలా? వారిలో ఏ లక్షణాలు కరోనా కావచ్చు?