Father Love: అరుదైన వ్యాధిపడిన కొడుకు.. బతికించుకోడానికి తండ్రి తాపత్రయం.. ఏకంగా మందుని కనిపెట్టిన కన్న ప్రేమ..

|

Nov 24, 2021 | 5:08 PM

Chinese Father: పిల్లలు అనారోగ్యం బారిన పడితే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. వారి ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తారు. అలాంటిది కన్నబిడ్డ కొన్ని రోజుల్లో చనిపోతాడని తెలిస్తే..

Father Love: అరుదైన వ్యాధిపడిన కొడుకు.. బతికించుకోడానికి తండ్రి తాపత్రయం.. ఏకంగా మందుని కనిపెట్టిన కన్న ప్రేమ..
Chinese Father
Follow us on

Chinese Father: పిల్లలు అనారోగ్యం బారిన పడితే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. వారి ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తారు. అలాంటిది కన్నబిడ్డ కొన్ని రోజుల్లో చనిపోతాడని తెలిస్తే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? వర్ణనాతీతం. కానీ ఇక్కడొక తండ్రి తన బిడ్డకు వచ్చిన అరుదైన వ్యాధికి మందు లేదని వైద్యులు చేతులు ఎత్తేశారు. దీంతో ఆ తండ్రి.. తనకొడుకుని బతికించుకోవాటానికి తానే స్వయంగా మందు కనిపెట్టాడు. వివరాల్లోకి వెళ్తే…

చైనాకు చెందిన జు వీ అనే వ్యక్తికి హయోయాంగ్‌ అనే రెండేళ్ల కొడుకు ఉన్నాడు. అతడు ‘మెంకేస్ సిండ్రోమ్’ అనే జన్యు పరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. జు వీ కొడుకు హయోయాంగ్‌ని పరీక్షించిన వైద్యులు అతడు కొద్ది నెలల మాత్రమే బతుకుతాడు అని తెలిపారు. పైగా ఈ వ్యాధి నాడివ్యవస్థను ప్రభావితం చేయడంతో కదలలేని స్థితిలో మంచానికే పరిమితమౌతాడన్నారు. ఈ వ్యాధిబారిన పడ్డవారు ఎలాంటి భావోద్వేగాన్ని తెలియజేయలేరు, పైగా మూడు సంవత్సరాలకు మించి జీవించరని చెప్పారు వైద్యులు. అయితే ఈ అరుదైన వ్యాధికి ఇంతవరకు ఎలాంటి మందు కనిపెట్టలేదని తెలుసుకున్న జు వీ తానే ఈ వ్యాధికి మందు కనిపెట్టాలని నిర్ణయించుకుటాడు. ఇందుకు తన అపార్ట్‌మెంట్‌ని ప్రయోగశాలగా మార్చేసాడు. అయితే జువీ కేవలం హైస్కూల్‌ చదువు మాత్రమే చదువుకున్నాడు. ఆన్‌లైన్‌ వ్యాపారం చేసే జువీ..తన కొడుకు వ్యాధి గురించి తెలిసినప్పటినుంచి పరిశోధనలతోనే గడిపాడు.. ఈక్రమంలో జు వీ ఈ వ్యాధి నయం చేయలేం కానీ మందులతో ఈ వ్యాధి లక్షణాలను తగ్గించగలమనే విషయాన్ని తెలుసుకున్నాడు. అందుకు కాపర్ హిస్టాడిన్ అంటే రాగి సహాయం చేస్తుందని కనుగొన్నాడు. కాపర్ క్లోరైడ్ డైహైడ్రేట్‌ను హిస్టిడిన్, సోడియం హైడ్రాక్సైడ్, నీరు కలిస్తే కాపర్ హిస్టాడిన్‌ని తయారువుతుందని తెలుసుకుని, మందు తయారు చేయడానికి ఒక ప్రత్యేక పరికరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

జు వీ తన కొడుకు హయోయాంగ్ తాను స్వయంగా తయారు చేసిన మందును ఇవ్వడం ప్రారంభించాడు. రెండు వారాల తర్వాత రక్త పరీక్షలు చేయించాడు. అందులో రక్తం సాధారణ స్థాయిలో ఉన్నట్లు రసాయన శాస‍్రవేత్తలు గుర్తిస్తారు. అంతేకాదు పిల్లవాడు మాట్లాడలేడు కానీ తన తండ్రి ఆ పిల్లవాడి తల మీద చేయవేయంగానే చిరు నవ్వుతో తన భావోద్వేగాన్ని తెలియజేశాడని ఆ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జు వీ తాను తయారు చేసిన కాపర్‌ హిస్తాడిన్‌ మందుని మొదట కుందేళ్లపై ప్రయోగించానని.. అవి ఆరోగ్యంగా ఉండటంతో తన కొడుకుకి ఏం కాదు అని నిర్థారించుకుని చికిత్స చేసినట్లు తెలిపాడు. ఈ చికిత్స కోసం ఇతర తల్లిదండ్రులు తనను సంప్రదించినప్పడు తన కొడుకుకి మాత్రమే బాధ్యత వహించగలనని చెప్పిన జువీ. అలా చేయడం వల్ల హెల్త్‌ అధికారుల ప్రమేయం ఉండదని తెలిపాడు. జువీతో కలిసి మెంకేస్ సిండ్రోమ్‌ జన్యు చికిత్స పరిశోధనను ప్రారంభిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు.

Also Read:  టీడీపీ అధినేత రాయల చెరువు పర్యటన వివాదాస్పదం.. అనుమతి లేదంటున్న పోలీసులు.. వెళ్తానంటున్న చంద్రబాబు