Russia-Ukraine War: నేనూ యుద్ధంలో పాల్గొంటా.. అధికారులను కోరిన 98ఏళ్ల బామ్మ.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

|

Mar 19, 2022 | 8:30 PM

మాతృదేశంపై రష్యా చేస్తున్న దురాక్రమణలకు ఖండిస్తూ ఉక్రెయిన్ (Ukraine) పౌరులు ధైర్య సాహసాలు చూపిస్తున్నారు. ప్రాణాలను లెక్క చేయకుండా దేశ సైన్యంతో కలిసి పోరాడుతున్నారు. తాజాగా 98 ఏళ్ల బామ్మ...

Russia-Ukraine War: నేనూ యుద్ధంలో పాల్గొంటా.. అధికారులను కోరిన 98ఏళ్ల బామ్మ.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
Ukraine Bamma
Follow us on

మాతృదేశంపై రష్యా చేస్తున్న దురాక్రమణలకు ఖండిస్తూ ఉక్రెయిన్ (Ukraine) పౌరులు ధైర్య సాహసాలు చూపిస్తున్నారు. ప్రాణాలను లెక్క చేయకుండా దేశ సైన్యంతో కలిసి పోరాడుతున్నారు. తాజాగా 98 ఏళ్ల బామ్మ.. తన దేశాన్ని కాపాడుకునేందుకు కదన రంగంలోకి దిగుతానని అధికారుల్ని సంప్రదించారు. పోరాడేందుకు అన్ని అర్హతలున్నా యుద్ధం (War) చేసేందుకు వయస్సు అడ్డు వచ్చింది. ఒల్హా వెర్డోఖ్లిబొవా.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సేవలు అందించారు. ఇప్పుడు తన జీవితంలో రెండోసారి యుద్ధాన్ని చూస్తున్నారు. ఈ వయస్సులోనూ ఆమె తన మాతృదేశాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఫిబ్రవరి 24న రష్యా దాడి (Attack) ప్రారంభించగా.. తన అంచనాలకు తగ్గట్టుగా ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోలేకపోతోంది. అందుకు స్థానిక ప్రజలే కారణంగా నిలుస్తున్నారు. వారు సైనికుల మాదిరిగా తుపాకులు పట్టుకొని, రష్యన్ సేనల్ని ఎదురిస్తున్నారు. వారిలో ఉత్సాహం తగ్గకుండా ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ స్ఫూర్తి మాటలు చెప్తున్నారు.

మరోవైపు.. రష్యా బలగాలను ప్రతిఘటించడానికి ఇతర దేశాల నుంచి ఉక్రెయిన్‌ తరఫున పోరాడటానికి వాలంటీర్లు ముందుకు వస్తున్నారు. గతంలో సోవియట్ యూనియన్‌లో కలిసి ఉన్న జార్జియా, బెలారస్ వంటి దేశాల నుంచి స్వచ్ఛందంగా వచ్చి, ఉక్రెయిన్ తరఫున పోరడటానికి సిద్ధం అవుతుున్నారు. పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తున్నా రష్యా అధినేత మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గత నెలలో రష్యాకు ఎగుమతులపై దక్షిణ కొరియా నిబంధనలను కఠినతరం చేసింది. అలాగే రష్యన్ బ్యాంకులతో లావాదేవీలను నిలిపివేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి, బెలారస్ మద్దతు ఇస్తోందన్న కారణంతో ఎగుమతి నియంత్రణ చర్యలను అమలు చేయాలని నియంత్రించామని అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి.

జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో భారత ప్రధాని మోడీ భేటీ.. ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలపై చర్చ

Tihar Jail: పెరోల్ పై బయటకు.. ఏడాదిన్నర అయినా తిరిగి రాలేదు.. తిహార్ జైలులో కలకలం

RRR Movie Pre Release Event Live: అంగరంగ వైభవంగా ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హాజరైన సీఎం..