Delta Tower : ఎయిర్ పోర్ట్ లో 84 అంతస్థుల టవర్ క్షణాల్లో నేల మట్టం.. వీడియో వైరల్

|

Feb 18, 2021 | 10:32 AM

అమెరికాలోని ఊటలోగల సాల్ట్ లేక్ సిటీ ఎయిర్ అథారిటీ ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో సాల్ట్ లేక్ సిటీ ఎయిర్ పోర్ట్ లో 84 అడుగుల ఎత్తైన స్టీల్, కాంక్రీట్ టవర్ క్షణాల్లో...

Delta Tower : ఎయిర్ పోర్ట్ లో 84 అంతస్థుల టవర్ క్షణాల్లో నేల మట్టం.. వీడియో వైరల్
Follow us on

Delta Tower : అమెరికాలోని ఊటలోగల సాల్ట్ లేక్ సిటీ ఎయిర్ అథారిటీ ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో సాల్ట్ లేక్ సిటీ ఎయిర్ పోర్ట్ లో 84 అడుగుల ఎత్తైన స్టీల్, కాంక్రీట్ టవర్ క్షణాల్లో నేలమట్టమయ్యింది. కేవలం కొని క్షణాల్లో కూలిన ఈ భవనం తాలూకా వీడియో ను ఎయిర్ పోర్ట్ అధికారులు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఎయిర్ పోర్ట్ తిరిగి మళ్ళీ అభివృద్ధి చేసే క్రమంలో బ్రహ్మాండమైన టవర్ కు టాటా చెప్పామని ప్రాజెక్ట్ డైరెక్టర్ మైక్ విలియమ్స్ చెప్పారు.

సాల్ట్ లేక్ సిటీ ఎయిర్ పోర్ట్ ను 1989 లో నిర్మించారు. ఎయిర్ పోర్ట్ ఆధునీకరణలోని భాగంగానే ఈ కూల్చివేతను చేపట్టామని చెప్పారు. ఇలా క్షణాల్లో ఎయిర్ పోర్ట్ నేలమట్టం కావడంతో ఎంతో సమయం ఆదాఅయ్యిందని చెప్పారు. ప్రాజెక్ట్ రెండో దశలో మరిన్ని కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. ఇలా క్షణల్లో ఎత్తైన భవనాలను కూల్చడానికి ఎక్కువ ఖర్చు కూడా కాదని తెలిపారు.

Also Read:

 ‘మహానటి’ ప్రేమలో ఉంది నిజమేనా..? కీర్తి పేరెంట్స్‌ ఏమంటున్నారంటే..

మహిళ స్కూటీలో నక్కిన త్రాచుపాము.. దారిలో వెళ్తుండగా చేతికి మెత్తగా తగలడంతో..