ఛీ.ఛీ పాఠాలు చెప్పాల్సిన టీచర్లే ఇలా.. స్కూల్ స్టూడెంట్స్ తో

|

Apr 17, 2023 | 11:00 AM

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే వారితో చేసే పనులు అసహ్యం కలిగించేలా చేస్తున్నాయి. అమెరికాలోని రెండు రోజుల వ్యవధిలోనే వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మహిళా టీచర్లు.. విద్యార్థులతో లైంగిక చర్యలు పాల్పడటం కలకలం రేపుతోంది.

ఛీ.ఛీ పాఠాలు చెప్పాల్సిన టీచర్లే ఇలా.. స్కూల్ స్టూడెంట్స్ తో
Teachers
Follow us on

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే వారితో చేసే పనులు అసహ్యం కలిగించేలా చేస్తున్నాయి. అమెరికాలోని రెండు రోజుల వ్యవధిలోనే వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మహిళా టీచర్లు.. విద్యార్థులతో లైంగిక చర్యలు పాల్పడటం కలకలం రేపుతోంది. ఆ టీచర్లను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కాలిఫోర్నియాలోని డానివిల్లే పట్టణానికి చెందిన ఎలెన్‌ షెల్‌ (38) అనే మహిళ స్థానిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇటీవల ఆమె ఇద్దరు 16 ఏళ్ల యువకులతో పలుమార్లు లైంగిక చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఆమెపై థర్డ్‌ డిగ్రీ అత్యాచారం అభియోగాలు నమోదయ్యాయి. ఆర్కన్సాస్‌ రాష్ట్రానికి చెందిన హెథర్‌ హరే (32) అనే మహిళా టీచర్‌పై లైంగిక దాడికి సంబంధించిన కేసు నమోదయ్యింది. టీనేజ్‌ విద్యార్థితో లైంగిక సంబంధానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అలాగే ఒక్లహామాకు చెందిన ఎమిలీ హాన్‌కాక్‌ (26) కూడా ఓ విద్యార్థితో సంబంధం నెరుపుతోందని ఆరోపణలు రావడంతో స్థానిక పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. లిన్‌కాల్న్‌ కౌంటీలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న ఎమ్మా డిలానె అనే టీచర్‌ .. అదే పాఠశాలలో చదువుతోన్న 15ఏళ్ల విద్యార్థితో సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయోవా రాష్ట్రంలోని దేస్‌ మొయిన్స్‌లో ఉన్న ఓ హైస్కూల్‌లో క్రిస్టెన్‌ గ్యాంట్‌ అనే ఇంగ్లిష్‌ టీచర్‌ అదే పాఠశాలకు చెందిన టీనేజీ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుందనే ఆరోపణలు రావడంతో అరెస్టయ్యింది.

అలాగే వర్జీనియాలోని హైస్కూల్‌లో ఓ మహిళా టీచర్‌ (33) ఓ విద్యార్థితో చాలా నెలలుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తోందనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు. వీటితోపాటు పెన్సిల్వేనియాకు చెందిన జావెలిన్‌ కోచ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇలా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో విద్యార్థులతో మహిళా టీచర్లు లైంగిక దుష్ప్రవర్తనకు సంబంధించి రెండు రోజుల్లోనే ఆరుగురిని అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..