Amazon Rainforest: అమెజాన్‌ అడవుల్లో బయల్పడ్డ అతి పురాతన నగరం.. సుమారు 3 వేల యేళ్లనాటిదిగా గుర్తింపు

|

Jan 14, 2024 | 2:25 PM

అమెరికాలోని అమెజాన్‌ మహారణ్యంలో ఓ ప్రాచీన నగరం బయల్పడింది. ఇది 2,500 ఏళ్ల నాటి నగరం అని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ఇది ఎవరి కంట పడకుండా గుప్తంగా ఉన్న ఈ నగరాన్ని.. తూర్పు ఈక్వెడార్ పరిధిలోని దట్టమైన అమెజాన్ వన సీమల్లో శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. ఈ నగరానికి సంబంధించిన అనేక విషయాలను శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇళ్లు, భవనాలు, వీధులను కలుపుతూ నెట్‌వర్క్ రోడ్లు, కాలువలతో ఎంతో ప్రణాళికాబద్ధంగా..

Amazon Rainforest: అమెజాన్‌ అడవుల్లో బయల్పడ్డ అతి పురాతన నగరం.. సుమారు 3 వేల యేళ్లనాటిదిగా గుర్తింపు
Amazon Rainforest
Follow us on

అమెరికాలోని అమెజాన్‌ మహారణ్యంలో ఓ ప్రాచీన నగరం బయల్పడింది. ఇది 2,500 ఏళ్ల నాటి నగరం అని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ఇది ఎవరి కంట పడకుండా గుప్తంగా ఉన్న ఈ నగరాన్ని.. తూర్పు ఈక్వెడార్ పరిధిలోని దట్టమైన అమెజాన్ వన సీమల్లో శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. ఈ నగరానికి సంబంధించిన అనేక విషయాలను శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇళ్లు, భవనాలు, వీధులను కలుపుతూ నెట్‌వర్క్ రోడ్లు, కాలువలతో ఎంతో ప్రణాళికాబద్ధంగా ఆ నగరాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఆ రోజుల్లోనే ఆధునిక నిర్మాణాలు ఉన్నట్లు ఆ కట్టడాలు బట్టి తెలుస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ ఈ ప్రాచీన నగరాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది.

ఈ నగరం దాదాపు 1000 ఏళ్ల పాటు మనుగడ సాగించి, ఆపై క్రమంగా అంతరించిపోయినట్టు భావిస్తున్నారు. ఈ పురాతన నగరంలో ఎంతమంది జీవించారనేది కచ్చితంగా చెప్పలేకపోతున్నప్పటికీ… సుమారుగా లక్ష మంది వరకు జీవించి ఉంటారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. శాస్త్రవేత్తలు ఓ విమానంలో లేజర్ సెన్సర్లు ఉంచి అమెజాన్ అడవులపై దాదాపు 300 చదరపు కిలోమీటర్ల మేర శోధించారు. ఈ లేజర్ సెన్సర్లు సేకరించిన సమాచారంతో సమన్వయం చేసుకుంటూ తవ్వకాలు సాగించిన పురావస్తు పరిశోధకులు దట్టమైన అడవి కింది భాగంలో ఉన్న ఈ నగరాన్ని గుర్తించారు. 500 బీసీ నుంచి 300 నుంచి 600 ఏడీ వరకు ఉపానో జాతి వాసులు ఇక్కడ జీవించినట్లు భావిస్తున్నారు. స్థానిక మట్టి దిబ్బలపై 6 వంటల ఇళ్లు నిర్మించి ఉన్నాయి. వాటి చుట్టూ వ్యవసాయ క్షేత్రాలు కూడా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ ప్రాంతంలో 33 అడుగుల వెడల్పు మేర రోడ్లు దాదాపు 20 కిలోమీటర్ల వరకు ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ నగరంలో కనీసం 10 వేల నుంచి 30 వేల మంది నివసించి ఉంటారని ఆంటోనే డోరిసన్ అనే సైంటిస్టు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం ఐదు జనావాసాలు నివాసం ఉండి ఉంటాయని, ఇళ్లను చెక్కతో నిర్మించుకున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరి ఇళ్లల్లో నిప్పు ఉంచడానికి ప్రత్యేక ప్రదేశాలు, రంధ్రాలు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు వెయ్యి ఏళ్ల క్రితం ఈ నగరం అదృశ్యమైనట్లు భావిస్తున్నారు.

కాగా దాదాపు 55 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అమెజాన్‌ మహారణ్యంలో అనేక జీవజాతులు, ఆదిమ తెగలకు ఆవాసంగా ఉంది. అనేక నాగరికతలు, సంస్కృతులకు పుట్టినిల్లుగానూ అమెజాన్‌కు పేరుంది. ఇటువంటి మహారణ్యంలో పురాతన నగరం బయల్పడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.