ప్రపంచంలో ఎక్కడో ఒకచోట విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక లోపాలు తలెత్తడం తదితర కారణాల వల్ల విమానాలు నేలకూలుతున్నాయి. ఫలితంగా చాలామంది మృత్యువాతపడుతున్నారు. తాజాగా అమెరికాలోని హ్యుస్టన్ నగరంలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఓ తేలికపాటి విమానం పారాగ్లైడర్‌ను ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని, పైలట్‌తో పాటు పారాగ్లైడర్ మృత్యువాత పడ్డారని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(FAA) అధికారులు తెలిపారు.
‘సింగిల్ ఇంజిన్ సెస్నా 208 విమానం హ్యూస్టన్‌లోని బుష్ ఇంటర్‌కాంటినెంటల్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. ఉదయం 9.40 గంటల సయమంలో టెక్సాస్‌లోని ఫుల్‌షీర్ సమీపంలోకి రాగానే గగనతలంలో ఉన్న ఓ పారాగ్లైడర్‌ను ఢీకొంది. విమానం నేలకూలిపోవడంతో విమానంలో ప్రయాణించిన వ్యక్తితోపాటు పారాగ్లైడర్ కూడా మృత్యువాత పడ్డారు. అయితే మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నాం’ అని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చెప్పుకొచ్చారు.
@TxDPSSoutheast is responding to a fatal plane crash in Fort Bend County.
The crash occurred near Fulshear.
The FAA has been notified and is responding to the scene. pic.twitter.com/7rLCzAIoFN
— TxDPS – Southeast Texas Region (@TxDPSSoutheast) December 21, 2021
Pushpa: బన్నీకి కంగ్రాట్స్ చెప్పిన అక్షయ్ కుమార్.. త్వరలోనే పుష్ప సినిమా చూస్తానని ట్వీట్..
Vijayawada: ఏపీలో కొనసాగుతున్న థియేటర్ల తనిఖీలు.. కృష్ణా జిల్లాలో 15 థియేటర్లు సీజ్..