Viral: ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ స్కాన్ చేస్తుండగా.. లోపల అనుమానాస్పద వస్తువులు.. బ్యాగులు ఓపెన్ చేయగా మైండ్ బ్లాంక్

|

Jun 29, 2022 | 8:38 PM

విమానాశ్రయ పెట్రోలింగ్ అధికారులు లగేజ్ స్కాన్ చేస్తుండగా ఇద్దరు మహిళల బ్యాగ్‌లలో రెండు అనుమానాస్పద వస్తువులను కనుగొన్నారు. దీంతో అనుమానంతో సూట్‌కేసులు ఓపెన్ చేసి.. కంగుతిన్నారు.

Viral: ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ స్కాన్ చేస్తుండగా.. లోపల అనుమానాస్పద వస్తువులు.. బ్యాగులు ఓపెన్ చేయగా మైండ్ బ్లాంక్
Smuggle The Animals
Follow us on

Bangkok airport: ఇసుక, మట్టి మాఫియానే కాదు.. తాజాగా వన్యప్రాణుల మాఫియా కూడా వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ వేదికగా మూగజీవాలతో కోట్లాది రూపాయల అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్న వ్యవహారం బయటపడింది. ఇప్పటికే విమానాల్లో డ్రగ్స్, బంగారం స్మగ్లింగ్ చేయడం చూశాం. అయితే వన్యప్రాణులను చెన్నై(Chennai)కు అక్రమ రవాణా చేసేందుకు యత్నించిన ఇద్దరు భారతీయ మహిళలను బ్యాంకాక్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. వారి సూట్‌కేసుల్లో ఏకంగా 109 వన్యప్రాణులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 38 ఏళ్ల నిత్యరాజా,  24 ఏళ్ల జకియా సుల్తానా ఇబ్రహీంలు రెండు లగేజ్‌ సూట్‌కేసుల్లో వన్యప్రాణులను తరలించేందుకు ప్రయత్నించినట్లు విమానాశ్రయ సిబ్బంది తెలిపింది. మహిళల సూట్‌కేసుల్లో రెండు తెల్ల పందికొక్కులు, రెండు అర్మడిల్లోలు, 35 తాబేళ్లు , 50 బల్లులు, 20 పాములను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని వెల్లడించారు. ఆ జీవులకు విటమిన్ సప్లిమెంట్లు అందించారు అధికారులు. ఆపై సరైన సంరక్షణ కోసం వన్యప్రాణుల రక్షణ కేంద్రానికి పంపారు. కాగా.. 2019లో, బ్యాంకాక్ నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చిన వ్యక్తి లగేజ్ బ్యాగ్‌లో  నెల వయస్సు గల చిరుతపులి పిల్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి