Accident Video: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న 49 వాహనాలు.. 16 మంది దుర్మరణం..

|

Feb 06, 2023 | 8:28 AM

హైవేపై వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. కొన్ని వాహనాలు ధగ్ధమయ్యాయని.. దీంతో చాలామంది వాహనాల్లో చిక్కుకుని తీవ్రగాయాలతో చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

Accident Video: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న 49 వాహనాలు.. 16 మంది దుర్మరణం..
Road Accident
Follow us on

చైనాలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో కనీసం 16 మంది మృతి చెందగా, 66 మందికి పైగా గాయపడ్డారు. హునాన్ ప్రావిన్స్ పరిధిలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు పేర్కొంటున్నారు. హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్‌షా నగరంలోని జుచాంగ్-గ్వాంగ్‌జౌ హైవేపై 10 నిమిషాల వ్యవధిలో మొత్తం 49 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయని.. దీంతో ఈ ఘోర ప్రమాదం జరిగిందని చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని CGTN న్యూస్ పోర్టల్ నివేదించింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

హైవేపై వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. కొన్ని వాహనాలు ధగ్ధమయ్యాయని.. దీంతో చాలామంది వాహనాల్లో చిక్కుకుని తీవ్రగాయాలతో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు మరణించగా.. 66 మంది గాయపడ్డారని.. వారిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

కాగా, ప్రమాదం సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం.. వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రులకు తరలించింది. ప్రస్తుతం వారికి చికిత్స అందుతుందని అధికారులు తెలిపారు.

ఈ ఘటన ఎలా జరిగింది.. అనే విషయంపై ప్రభుత్వం విచారణ జరుపుతోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..