Gun Fire in School: స్కూల్‌కు గన్‌ తీసుకొచ్చిన బాలిక.. తరగతి గదిలో విద్యార్ధులపై కాల్పులు! ఒకరు మృతి

|

Dec 07, 2023 | 3:26 PM

పాఠశాల తరగతి గదిలో 14 ఏళ్ల బాలిక గన్‌తో కాల్పులు జరిపింది. ఈ ఘటనలో తోటి విద్యార్ధి హత్య చేసింది. మరో ఐదుగురు విద్యార్ధులకు బుల్లెట్లు తగిలి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రష్యాలోని బ్రయాన్స్క్‌లోని ఓ పాఠశాలలో గురువారం (డిసెబర్‌ 7) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రష్యాలోని బ్రయాన్స్క్‌లోని ఓ పాఠశాలలో చదువుతోన్న 14 ఏళ్ల బాలిక తరగతి గదికి పంప్-యాక్షన్ షాట్‌గన్‌ను తీసుకువచ్చింది. ఆ గన్‌తో తన..

Gun Fire in School: స్కూల్‌కు గన్‌ తీసుకొచ్చిన బాలిక.. తరగతి గదిలో విద్యార్ధులపై కాల్పులు! ఒకరు మృతి
Gun Fire In School
Follow us on

రష్యా, డిసెంబర్ 7: పాఠశాల తరగతి గదిలో 14 ఏళ్ల బాలిక గన్‌తో కాల్పులు జరిపింది. ఈ ఘటనలో తోటి విద్యార్ధి హత్య చేసింది. మరో ఐదుగురు విద్యార్ధులకు బుల్లెట్లు తగిలి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రష్యాలోని బ్రయాన్స్క్‌లోని ఓ పాఠశాలలో గురువారం (డిసెబర్‌ 7) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రష్యాలోని బ్రయాన్స్క్‌లోని ఓ పాఠశాలలో చదువుతోన్న 14 ఏళ్ల బాలిక తరగతి గదికి పంప్-యాక్షన్ షాట్‌గన్‌ను తీసుకువచ్చింది. ఆ గన్‌తో తన తోటి విద్యార్థులపై బాలిక కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఒక విద్యార్ధి మృతి చెందగా, ఐదుగురు విద్యార్ధులకు బుల్లెట్లు తగిలాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. కాల్పుల సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాలిక తన తండ్రి గన్‌ని పాఠశాలకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో మరో ఘటన: పుష్ప ఫేమ్‌ జగదీశ్‌ అరెస్ట్‌.. యువతికి వేధింపులు, ఆత్మహత్య

యువతి ఫొటోలు తీసి బెదిరింపులకు దిగడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో సినీ నటుడు బండారు ప్రతాప్‌ అలియాస్‌ జగదీశ్‌ (31)ను బుధవారం పంజాగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగదీశ్‌ స్వస్థలం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా. అయితే అతను ప్రస్తుతం రాంగోపాల్‌పేట్‌లో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు. సినిమా అవకాశాలు రాక ముందు జగదీశ్‌ షార్ట్‌ ఫిల్మ్‌లు తీసేవాడు. అలా షార్ట్‌ ఫిల్మ్‌లలో నటించే ఓ యువతితో ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్తా సన్నిహితంగా మారింది. అప్పటికే ఆమెకు వివాహమై భర్త నుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది.

పుష్ప సినిమాలో కేశవ పాత్రతో మంచి గుర్తింపు దక్కించుకున్న జగదీశ్‌ ఆ తర్వాత నుంచి యువతికి దూరంగా ఉండటం ప్రారంభించాడు. ఇద్దరి మధ్య పలుమార్లు ఈ వివాహ విషయమై గొడవలు జరిగాయి. ఈ క్రమంలో జగదీశ్‌ నవంబర్‌ 27న పంజాగుట్ట పరిధిలోని ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమె మరో వ్యక్తితో చనువుగా ఉండగా ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలను అడ్డుగా పెట్టుకుని, వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి పరువు తీస్తానంటూ మహిళను బెదిరించ సాగాడు. దీంతో మనస్తాపానికి గురైన బాధితురాలు నవంబర్‌ 29న ఉరేసుకొని తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి జగదీశ్‌పై ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ కథనాల కోసం క్లిక్‌ చేయండి.