ఇండోనేషియాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఆ దేశంలోని సెరాసన్ దీవిలో కుండపోత వర్షాలు కురిశాయి. దాంతో వరదలు పోటెత్తి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు 11 మంది ప్రాణాలు తీసింది. మరో 50 మంది గల్లంతయ్యారు. అయితే, విపత్తు జరిగిన ప్రాంతంతో ఇతర ప్రాంతాలకు సమాచార సంబంధాలు తెగిపోయాయి. ఈ మేరకు నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.
ఏజెన్సీ అందించిన చిత్రాలు బోర్నియో, మలేషియా ప్రధాన భూభాగం మధ్య ఉన్న సెరాసన్ ద్వీపంలోని ఒక కొండ అంచుకు సమీపంలో పరిస్థితిని, కొండచరియలు విరిగిపడిన, మట్టి శిధిలాలు కనిపించాయి. దాంతో అక్కడ రక్షణ, సహాయక చర్యలు చేపట్టడానికి తీవ్ర ఆలస్యమవుతోంది.
సముద్ర మార్గం గుండా అక్కడి వెళ్లడానికి ఐదు గంటల సమయం పడుతుందని, అందుకే హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ టీమ్స్‌ను విపత్తు ప్రదేశానికి తరలిస్తున్నామని ఇండోనేషియా అధికారులు తెలిపారు. బోర్నియోలోని బంజర్ జిల్లాలో వరదల ధాటికి 17 వేల ఇండ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..