స్వామి వారి వక్షస్థలంలో కొలువైన వ్యూహలక్ష్మి ఎవరో తెలుసా?

మూలవిరాట్ వ్రక్షస్థలంలో ప్రతిస్టించబడిన మహాలక్ష్మి ఎవరు ? ఆ లక్ష్మిదేవి మహిమలెంటి ? శ్రీవారి వ్రక్షస్థలంపై ఎవరు ప్రతిస్టించారు ? శుక్రవారం నాడు శ్రీ మన్నారాయణునికి అభిషేకం ఎంధుకు నిర్వహిస్తారు ? అసలు వైకుంట నాధుడ్ని శ్రీనివాసుడుగా ఎంధుకు పిలుస్తారు ? ప్రపంచంలో ఏ ఇతర దేవాలయాలకు రాని ధన, జన ఆకర్షణ పెరగడానికి కారణాలెంటి ? ఇంతవరకు వెలుగులోకి రాని వక్షస్థల లక్ష్మి అయిన (వ్యూహలక్ష్మి) గురించి తెలుసుకుందాం. తిరుమలలో శ్రీవారి దేవాలయంలో గర్భాలయంలో వెలసిన […]

స్వామి వారి వక్షస్థలంలో కొలువైన వ్యూహలక్ష్మి ఎవరో తెలుసా?
Follow us

| Edited By:

Updated on: Sep 28, 2019 | 5:57 AM

మూలవిరాట్ వ్రక్షస్థలంలో ప్రతిస్టించబడిన మహాలక్ష్మి ఎవరు ? ఆ లక్ష్మిదేవి మహిమలెంటి ? శ్రీవారి వ్రక్షస్థలంపై ఎవరు ప్రతిస్టించారు ? శుక్రవారం నాడు శ్రీ మన్నారాయణునికి అభిషేకం ఎంధుకు నిర్వహిస్తారు ? అసలు వైకుంట నాధుడ్ని శ్రీనివాసుడుగా ఎంధుకు పిలుస్తారు ? ప్రపంచంలో ఏ ఇతర దేవాలయాలకు రాని ధన, జన ఆకర్షణ పెరగడానికి కారణాలెంటి ? ఇంతవరకు వెలుగులోకి రాని వక్షస్థల లక్ష్మి అయిన (వ్యూహలక్ష్మి) గురించి తెలుసుకుందాం.

తిరుమలలో శ్రీవారి దేవాలయంలో గర్భాలయంలో వెలసిన మూలవిరాట్టు వ్రక్ష స్థలంలో మహాలక్ష్మి యొక్క ప్రతిమ ప్రతిష్టించబడి ఉంటుంది. అందుకే వైకుంఠ నాధుడ్ని శ్రీనివాసుడు గా పిలుస్తారు.ఈ శ్రీ మహాలక్ష్మినే వ్యూహలక్ష్మి అని తంత్ర శాస్త్రంలో పేరు. ఇది ప్రపంచంలో ఏ దేవాలయంలో లేని తంత్ర శాస్త్ర విశేషమైన కార్యక్రమం.. ఒకానొక సంధర్భంలో స్వామి వారు ఎవరు అనే ధర్మసందేహం కలిగిన రోజుల్లో భగవత్ రామానుజుల వారే స్వామి వారు సాక్షాత్తు వైకుంఠ నాధుడని, వైకుంఠంనుండి భూలోకంలో ఆచ్ఛావతార మూర్తిగా అవతరించారని, స్వామి వారికి శంఖు చక్రాలను ఏర్పాటు చేసి పచ్చకర్పూరంతో నామంపెట్టి వక్షస్థలంలో వ్యూహాలక్ష్మి ప్రతిమను ఏర్పాటు చేశారని పురాణాలు చెబుతున్నాయి.

Vyuha Lakshmi on Lord's Vakshasthalam Tirumala Tirupati Vaibhavam

వక్షస్థలంలో మహాలక్ష్మి ఉండటం వల్లే శుక్రవారాలలో శ్రీమన్నారాయణునికి అభిషేకం నిర్వహించాలని కూడా రామనుజులవారే ఆరంభించారని శిలాశాసనాలలో పేర్కొనబడ్డాయి. అంతే కాకుండా జియాంగార్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, శ్రీవారి కైంకర్యంకోసం తొలి జీయర్ మఠాన్ని కూడా ఆనాడే స్థాపించారని, ఈ సంప్రదాయం. ఇది నాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. అలా శ్రీవారి వక్షస్థలంలో ఈ వ్యూహాలక్ష్మి ఉండటం వల్లే స్వామివారి కి జన, ధన ఆకర్షణ విశేషంగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే.

Vyuha Lakshmi on Lord's Vakshasthalam Tirumala Tirupati Vaibhavam

ఈ వ్యూహ లక్ష్మిని వర్ణిస్తూ విభుజా అంటారు.. సాధారణంగా చతుర్భుజాలతో దర్శన భాగ్యం కలిగించే మహాలక్ష్మి శ్రీవారి వక్షస్థలంలో ఉండగా మూడు భుజాలతోనే దర్శనం ఇస్తారు కనుక త్రిభుజా అని పిలుస్తారు. శ్రీవారితో ఉన్నప్పుడు నాలుగు భుజాలతో పద్మాలు అలంకరించుకుంటే పద్మాసనంగా పద్మంలో కూర్చున్నట్టుగా మనకు దర్శనమిస్తారు ఈ వ్యూహలక్ష్మి కి ప్రతి శుక్రవారం నాడు పసుపుతో అభిషేకం జరుగుతుంది. అభిషేకం తర్వాత అమ్మవారిని అలంకరిస్తారు, స్వామి వారికి కూడా అభిషేకం తర్వాత పచ్చకర్పూరం అలంకరిస్తారు. అనంతరం స్వర్ణాభరణాలు. పుష్పమాలలతో అలంకరిచిన తరువాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు, ఈ వ్యూహలక్ష్మి ని దర్శించుకొనే భక్తులకు కోరినన్నికోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఈ వ్యూహాలక్ష్మినే స్వర్ణ లక్ష్మిగా పూజిస్తారు, మహాలక్ష్మి అమ్మవారు మాంగల్యం తో మనకు దర్శనమిస్తారు అందుకే శ్రీవత్సమని అని పిలుస్తారు. మహాలక్ష్మికి అంటే ఈ ప్రతిమకు కూడా శుక్రవారం నాడు స్వామి వారి ఏకాంతంగా శ్రీ సూక్తం గా సుగంధ ద్రవ్యంతో , చందనంతో అభిషేకం జరిపి నూతన వస్త్రాలను ధరింపజేసి స్వామి వారికి మహాలక్ష్మికి ప్రత్యేక ఆరాధనల తరువాత కర్పూర హారతి ఇస్తారు. ఈ విధంగా పూజాలందుకుంటున్న వ్యూహాలక్ష్మిని దర్శించుకున్న భక్తులందరికీ సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!